మీ ఇమేజ్‌ కోసం కమలా హారిస్ పేరు వాడొద్దు: మీనా హారిస్‌కు వైట్‌హౌస్ చురకలు

మన బంధువల్లోనో, స్నేహితుల్లోనో బాగా డబ్బున్న, పేరున్న, పలుకుబడి వున్న వారి పేరుని మనం అప్పుడప్పుడు వాడుతుంటాం.ఫ్రెండ్స్ దగ్గర గొప్పలు చెప్పుకోవడానికి కావొచ్చు.

 Stop Using Kamala Harris Name To Build Brand, White House Lawyers Caution Meena-TeluguStop.com

లేదు ఏదైనా ముప్పు తప్పించుకోవడానికి కావొచ్చు.కారణం ఏదైనా ఫలానా వారు మాకు ఎంత క్లోజో అని చెప్పుకోవడానికి తెగ తాపత్రాయపడతాం.

కొన్ని సార్లు వారి పరపతి మనల్ని ప్రమాదాల నుంచి కాపాడినా.ఇంకొన్ని సార్లు ఇబ్బంది పాలు చేస్తుంది.

అచ్చం ఇలాంటి విషయంలోనే మాటలు పడ్డారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సమీప బంధువు మీనా హారిస్.వైస్ ప్రెసిడెంట్‌గా అత్యున్నత హోదాలో వున్న కమలా హారిస్‌ పేరుని, పరపతిని వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి వాడొద్దంటూ వైట్ హౌస్ మీనాను హెచ్చరించింది.

ఈ మేరకు అమెరికాలోని పలు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.

మీనా హారిస్‌, కమలా హారిస్‌ సోదరి కుమార్తె.2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈమె బైడెన్- హారిస్‌ తరపున విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు.ప్రత్యర్థుల విమర్శలకు ఘాటుగా కౌంటర్లిస్తూ కమలపై ఈగ వాలనిచ్చే వారు కాదు.

మీనాకు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో భారీగా ఫాలోవర్లు వున్నారు.వృత్తిరీత్యా న్యాయవాది అయిన మీనా.

‘‘కమలా అండ్‌ మాయాస్‌ బిగ్‌ ఐడియా’’ తదితర పుస్తకాలు కూడా రాశారు.ఈమె ‘ఫినామినల్‌’ అనే వస్త్రాల బ్రాండ్‌కు వ్యవస్థాపకురాలు కూడా.

ఐతే ఈ బ్రాండ్‌ వస్త్రాలపై ‘వైస్‌ ప్రెసిడెంట్‌ ఆంటీ’ అంటూ ముద్రించడం విమర్శలకు తావిచ్చింది.అలాగే బైడెన్- హారిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు మీనా ప్రైవేటు విమానంలో ప్రయాణించటంపై పలువురు పెదవి విరిచారు.

ఈ నేపథ్యంలో మీనా తన వ్యక్తిగత కార్యకలాపాల్లో వైస్‌ ప్రెసిడెంట్‌ పేరును ఉపయోగించవద్దని.వైట్‌ హౌస్‌‌కు చెందిన న్యాయవాదులు సున్నితంగా హెచ్చరించారు.

అంతేకాకుండా ఉపాధ్యక్షురాలి బంధువుగా ఆమె పాటించాల్సిన నియమ నిబంధనలను కూడా వివరించినట్లు తెలిసింది.

Telugu America, Biden, Kamala Harris, Meena, Wise-Telugu NRI

దీనిపై స్పందించిన మీనా హారిస్… ఎన్నికల ప్రచారం నుంచి అన్ని నియమాలను తాను పాటిస్తున్నట్లు ఆమె స్పష్టం చేసినట్టు సమాచారం.అంతేకాకుండా కమలా హారిస్‌కు సంబంధించినవి, ఆమెను పోలిన చిహ్నాలను, పేర్లను తమ వెబ్‌సైట్‌ నుంచి తొలగించినట్లు కూడా మీనా వివరణ ఇచ్చారు.ఇకపై కూడా కమలా హారిస్‌ పేరును తమ వస్తువుల ప్రచారంలో వాడబోమని హామీ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube