బాబోయ్ ఇదేం చిత్రం.. ఆ బాలిక ఏడిస్తే కంట్లోంచి రాళ్లు వస్తాయట!

సోషల్ మీడియా అంటేనే వింతలు వినోదాలకు పెట్టింది పేరు.అలంటి సోషల్ మీడియా ద్వారా రోజు మనల్ని ఆశ్చర్య పర్చే సంఘటనలు గురించి మనం వింటూనే ఉంటాం.

 Stones Are Falling From The Girls Eyes With Tears-TeluguStop.com

అన్ని విషయాలు మనం నమ్మే విధంగా ఉండవు.చెవులతో విన్న మాటలనే కాదు కళ్ళతో చూసే వీడియో చుసిన కూడా కొన్ని సంఘటనలను మనం నమ్మలేము.

అవి ఫేక్ అని కొట్టిపారేస్తాము.

 Stones Are Falling From The Girls Eyes With Tears-బాబోయ్ ఇదేం చిత్రం.. ఆ బాలిక ఏడిస్తే కంట్లోంచి రాళ్లు వస్తాయట-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాంటి విషయం గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం.

మనం మాములుగా ఏడిస్తే కంట్లో నుండి కన్నీటి చుక్కలు వస్తాయి.ఇది అందరికి తెలిసిన విషయమే.

మనం కొద్దిగా ఎమోషనల్ గా ఉన్నా లేదంటే ఏదైనా బాధ పడే సంఘటన జరిగిన మనం ఏడుస్తూ ఉంటాం.అలా ఏడ్చినప్పుడే మనకు కన్నీళ్లు వస్తాయి.

కానీ ఒక బాలికకు మాత్రం కన్నీళ్లు రావట.

ఆ పాప ఏడిస్తే ఎడమ కంట్లో నుండి కన్నీళ్లకు బదులుగా రాళ్ళూ వస్తాయట.

ఏంటి ఆశ్చర్య పోతున్నారా నిజం ఆ బాలికకు ఏడ్చినప్పుడు కన్నీళ్లకు బదులుగా రాళ్ళూ వస్తున్నాయట.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ లో జరిగింది.

చాందిని అనే 15 సంవత్సరాల బాలికకు ఈ సమస్య ఉందట.ఈమె తల్లిందండ్రులు ఈ సమస్యకు పరిస్కారం కోసం చాలా హాస్పిటల్స్ కూడా తిరిగారట.

చాందిని కి జులై 27 నుండి ఈ సమస్య మొదలయ్యిందట.ఆమె ఏడిస్తే కన్నీళ్లతో పాటు చిన్న సైజు రాళ్ళూ కూడా బయటకు వస్తున్నాయట.కేవలం ఏడ్చినప్పుడే కాకుండా ఆ బాలిక కొద్దిగా ఒత్తిడికి లోనైనా లేదంటే కన్ను కొద్దిగా నిలిపిన ఈ సమస్య ఎదురవుతుండడంతో పాపం ఆ బాలిక నరకయాతన అనుభవిస్తుందట.ఆ బాలిక తన కన్ను ఎర్రగా అయ్యి మంట పుడుతుందని చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తుంది.

డాక్టర్స్ కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపక పోవడంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు ఏం చేయాలో అర్ధం కాక తల్లడిల్లుతున్నారు.

.

#Eyes Tears #Pebbles #Uttar Pradesh #Eye #Teenage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు