చంద్రబాబు సభపై రాళ్ల దాడి..!!

గత కొన్ని రోజుల నుండి టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.ఎక్కడికక్కడ రోడ్ షోలు నిర్వహిస్తూ ఇంటింటికి తిరుగుతూ తిరుపతి ఓటర్లను ఆకర్షించటానికి అనేక హామీలు ఇస్తూ ఉన్నారు.

 Stone Attack On Chandrababu Sabha-TeluguStop.com

కాగా ప్రచారంలో భాగంగా తిరుపతి గాంధీ రోడ్ లో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.మేటర్ లోకి వెళితే చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన వాహనం పై రాళ్లు విసిరారు.

ఈ ఘటనలో ఓ మహిళతో పాటు యువకుడికి గాయాలయ్యాయి.వెంటనే విషయం తెలుసుకుని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి గాయపడిన వారితో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

 Stone Attack On Chandrababu Sabha-చంద్రబాబు సభపై రాళ్ల దాడి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యం, పిరికిపంద చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.జడ్ ప్లస్ కేటగిరి లో ఉన్న తనకి భద్రత కల్పించలేని పోలీసులు ఇక సామాన్యులను ఏమి రక్షిస్తారు అంటూ చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇదే టైమ్ లో ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా టిడిపి క్యాడర్ కూడా నిరసనకు దిగింది.దీంతో ప్రస్తుతం తిరుపతిలో పోలీసులకు టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం నడుస్తూ ఉంది.

 అంతేకాకుండా ఈ విషయంపై చంద్రబాబు తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయం కు చేరుకుని ఏఎస్పీలు సుప్రజ, మునిరామయ్య లకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది.

#Tirupathi #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు