వర్షపు నీటితో క్యాన్సర్.. తాజా పరిశోధనలో వెల్లడి..

వర్షపు నీటిని ఎంతో మంది చాలా సురక్షితమైందిగా భావిస్తారు.అయితే వర్షపు నీటిని నేరుగా తాగకపోయినా.

 Stockholm University Scientists Found That Rainwater Contaminated With Cancer Ch-TeluguStop.com

ఇది మన తాగునీటి వనరులకు ప్రధానమైన సరఫరా.అయితే వర్షపు నీటి గురించి తాజాగా జరిగిన పరిశోధన షాకింగ్ విషయాలు వెల్లడించింది.

వర్షపు నీటిని తాగవద్దని పరిశోధకులు చెబుతున్నారు.భూమిపై చాలా ప్రదేశాల్లో వర్షపు నీటిలో భద్రతా స్థాయిలను మించి ‘ఫరెవర్ కెమికల్స్’ ఉన్నట్లు పరిశోధనలో తేలింది.

భూమిపై పడే వర్షపు నీటిలో అసురక్షిత స్థాయిలో పర్ అండ్ పాలీ – ఫ్లోరో అల్కైల్ పదార్థాలు(PFAS) ఉన్నట్లు స్టాక్ హోమ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.PFAS అనేది సింథటిక్ పదార్థాలు.

అంటే నాన్ స్టిక్ పాన్ లు, ఫైర్ ఫైటింగ్ ఫోమ్, ఫుడ్ ప్యాకేజింగ్, రెయిన్ గేర్, కాగితం, ఎలక్ట్రానిక్స్, సౌందర్య సాధనాలు, పెయింట్ తో సహా అనేక ఉత్పత్తుల్లో వీటిని ఉపయోగిస్తారు.ఈ ఫ్లోరిన్ ఆధారిన సమ్మేళనాలు దాదాపు 4,500 ఉన్నాయి.

రసాయనాలు పర్యావరణంలో విచ్ఛిన్నం కావు.అందుకే వీటిని ‘ఫరెవర్ కెమెకల్స్’ అని పిలుస్తారు.

స్టాక్ హోమ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేస్తున్న ఈ పరిశోధన ఇప్పటివకు అసంపూర్తిగా ఉన్నప్పటికీ, PFAS క్యాన్సర్ తో సహా అనేక ఆరోగ్య సమస్యలు కలిగిస్తుందని పరిశోధకులు భయాందోళనకు గురవుతున్నారు.

Telugu Cancer, Chemicals, Care, Rainwater, Rainwatercancer, Spread, Stockholm-La

ఇక తాగునీటిలో ఈ PFAS విస్తరిస్తూ ఉండటంతో పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు.ఇంగ్లండ్ లోని నీటి నమూనాల్లో భద్రతాస్థాయిలను మించి PFAS ఉన్నట్లు ఇటీవల పరిశోధనలో తేలింది.

ప్రపంచంలో ఉన్న భూమి ఇదేవిధంగా కలుషితమైనట్లు పరిశోధకులు చెబుతున్నారు.

ఈ రసాయణాల వల్ల మరణాలు సంభవించకపోవచ్చు కానీ.సంతానోత్సత్తి సమస్యలు, క్యాన్సర్ ముప్పు, పిల్లల పెరుగుదలపై ఇవి ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

తాగునీటిలో PFAS తగ్గించడం అనేది ఖర్చతో కూడుకున్న పని.అందుకే పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాలను నదులు, కాలువల్లో రాకుండా చర్యలు చేపట్టాలి.అప్పుడే తాగునీటిలో PFAS స్థాయిలను తగ్గించగలుగుతాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube