చైనాతో ఘర్షణ.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ !

స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా నష్టాల్లోకి పయనిస్తోంది.ఉదయం పూట లాభాల్లో దూసుకుపోయిన సూచీలు నేలమట్టం అయ్యాయి.

 Stock Amrket In Losses, Bse Sensex, Stock Market, Loss,china War, India-TeluguStop.com

ఓ దశలో 40,010 వద్ద గరిష్టాన్ని తాకి సెన్సెక్స్ ఏకంగా 899 పాయింట్లు కోల్పోయింది.చైనాతో మళ్లీ ఘర్షణ జరిగిందని వార్త రావడంతో ఈ ఉలికిపాటు సంభవించింది.

లాక్ డౌన్ సడలింపులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సానుకూల స్పందనల నేపథ్యంలో మార్నింగ్ సెషన్ లో భారీగా లాభాల్లో దూసుకెళ్లిన సూచీ చైనాతో ఘర్షణ వార్తతో ఒక్కసారిగా కుప్పకూలింది.

దీంతోపాటుగా జీ20 సభ్య దేశాల్లో అత్యల్ప వృద్ధిరేటు భారతదేశంలోనే నమోదు కానుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

దీంతో స్టాక్ మార్కెట్ ను మరింత కలవరపాటుకు గురిచేశాయి.ఈ వార్తతో దాదాపు తొమ్మిది రంగాల్లో షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.ఈ రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు సెన్సెక్స్ 721 పాయింట్లకు నష్టపోయి 38,745 వద్ద కొనుగుతుండగా.నిఫ్టీ 233 పాయింట్లు తగ్గి 11,417 వద్ద కొనసాగుతోంది.రూపాయి వ్యాల్యూ రూ.73.81 గా కొనసాగుతోంది.స్టాక్ మార్కెట్ నష్టాల్లో కుంగిపోవడంతో జీఎన్ జీసీ, వీప్రో, భారతీ ఇన్ ఫ్రాటెల్ కంపెనీ షేర్లు స్వల్ప లాభాలతో నడుస్తున్నాయి.

ఐషర్ మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, జీ ఎంటర్ టైన్ మెంట్, శ్రీ సిమెంట్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube