ఆ యంగ్ హీరో చనిపోయి సంవత్సరం అవుతున్నా ఇప్పటికీ కేసు మాత్రం తేలలేదు.... 

బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరిగ్గా ఏడాది క్రితం పలు మానసిక ఒత్తిడులను మరియు వృత్తి పరమైన సమస్యలను తట్టుకోలేక తన సొంత నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురించి అందరికీ తెలిసిందే.కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకు మరణానికి కారణం బాలీవుడ్ యంగ్ హీరోయిన్ రియా చక్రవర్తి అని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రియా చక్రవర్తి ని పోలీసులు అరెస్టు చేసి దాదాపుగా ఎనిమిది నెలలపాటు కస్టడీలో ఉంచి విచారణ చేశారు.

 Still Verdict Is Pending In Sushant Singh Raj Rajput Case-TeluguStop.com

కాగా ఇటీవలే రియా చక్రవర్తి బెయిల్ పై విడుదల అయ్యింది.

అయితే ఈ సంఘటన జరిగి దాదాపు ఏడాదికి పైగా కావస్తున్నప్పటికీ అసలు సుశాంత్ సింగ్  ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మరియు అతడు ఆత్మహత్యకు కారణమైన వారు ఎవరనే విషయాల గురించి మాత్రం ఇప్పటికీ పోలీసులు స్పష్టత ఇవ్వలేదు.

 Still Verdict Is Pending In Sushant Singh Raj Rajput Case-ఆ యంగ్ హీరో చనిపోయి సంవత్సరం అవుతున్నా ఇప్పటికీ కేసు మాత్రం తేలలేదు…. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు పోలీసులు ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీనికితోడు ఇటీవలే రియా చక్రవర్తి ని మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ప్రకటించడంతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు మరోమారు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఇటీవలే సుశాంత్ సింగ్ మరణించి సంవత్సరం కావడంతో పలువురు సినీ సెలబ్రిటీలు మరియు అభిమానులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మకు శాంతి కలగాలని తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంతేకాకుండా పలువురు సెలబ్రిటీలు సుశాంత్ సింగ్ రాజ్ పుత్  తో గడిపిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.

Telugu Bollywood, Bollywood Hero, Rhea Chakravarthi, Still Verdict Is Pending In Sushant Singh Raj Rajput Case, Sushant Singh Raj Rajput, Sushant Singh Raj Rajput Death News-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణం రియా చక్రవర్తి అని అప్పట్లో తీవ్ర అభియోగాలు వినిపించాయి.అంతేకాకుండా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి రియా చక్రవర్తి మాదక ద్రవ్యాల వినియోగించే అలవాటు చేసిందని కూడా సుశాంత్ సింగ్ తల్లిదండ్రులు ఆరోపించారు.ఏదేమైనప్పటికీ  ఓ బలహీన క్షణంలో తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యంగ్ హీరో అకాల మరణం సినిమా పరిశ్రమకు తీరని లోటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

#SushantSingh #SushantSingh #StillVerdict

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు