హ్యాంగవుట్స్‌ ఇంకా వాడుతున్నారా? నవంబర్ తర్వాత ఇక పనిచేయబోవు, చూసుకోండి జరా!

Google 2013లో Hangouts అనే ఒక ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్ ప్రారంభించిన సంగతి తెలిసినదే.అయితే గూగుల్ నుండి వచ్చి, అంతగా ప్రజాదరణకు నోచుకోలేని సర్వీసులలో ఇది ఒకటని చెప్పుకోవచ్చు.

 Still Using Hangouts‌ Will No Longer Work After November, Look Zara!,గూగ-TeluguStop.com

ఎందుకంటే దీనికంటే ధీటైన, సులువైన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్స్ రావడం వలన ఇదంటూ ఒకటుందనే విషయం జనాలు మర్చిపోయారు.ఈ క్రమంలో గూగుల్ ఈ యాప్ యూజర్లను 2020 నుంచి గూగుల్ చాట్ కి మారిపోవాలని విజ్ఞప్తి చేస్తోంది.

ఎందుకంటే హ్యాంగవుట్స్‌ను శాశ్వతంగా నిలిపివేస్తామని, అందువల్ల యూజర్లు తమ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవాలని కూడా చెబుతూ వస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా గూగుల్ బ్లాగ్‌లో హ్యాంగవుట్స్‌ను నవంబర్‌లో శాశ్వతంగా నిలిపివేస్తామని పేర్కొంది.

ఇప్పటికీ హ్యాంగవుట్స్‌ను యూజ్ చేస్తున్నవారు గూగుల్ చాట్‌కి మారిపోవాలని కోరుతోంది.ఇక గూగుల్ చాట్ సర్వీసెస్ అనేది 2020లోనే అందరికీ అందుబాటులోకి వచ్చింది.

ఇది ఓ రకముగా హ్యాంగవుట్స్‌ అప్డేటెడ్ ఫీచర్ అని చెప్పుకోవాలి.అందుకే గూగుల్ హ్యాంగవుట్స్‌ను వదిలేసి చాట్‌ వినియోగించాలని చెబుతోంది.

ఇప్పటికీ మారని యూజర్లు నవంబర్‌లోపు హ్యాంగవుట్స్‌లోని తమ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది.

Telugu Google Hangout, Ups-Latest News - Telugu

గూగుల్ చాట్ కావాలనుకునేవారు జీమెయిల్‌ వెబ్/మొబైల్ లోనే ఈ సర్వీసెస్ పొందొచ్చు.ఇందుకోసం మొబైల్ యూజర్లు జీమెయిల్ యాప్‌లోని లాంచ్ పేజీలో కింద కనిపిస్తున్న కన్వర్జేషన్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.లేదా సపరేట్‌గా గూగుల్ చాట్ యాప్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అదేవిధంగా, హ్యాంగవుట్స్‌ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ వాడుతున్న పీసీ యూజర్లు వెబ్‌లోనే చాట్‌కు మారవచ్చు లేదా చాట్ వెబ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube