భర్త విమానం నడిపే పైలట్.... భార్య డైరెక్షన్స్ ఇచ్చే ఉద్యోగిని... కానీ

కొన్ని కొన్ని విషయాలు మన కళ్లెదురుగానే జరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితులు ఏర్పడుతుంటాయి.భార్య భర్తలు ఒకే చోట ఉద్యోగం అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని భావిస్తూ ఉంటారు.

 Still Now Not Traced The An 32 Aircraft-TeluguStop.com

కానీ సంధ్యా తన్వర్ కు వచ్చిన పరిస్థితి చూస్తే మాత్రం నిజంగా ఇద్దరూ ఒకే చోట ఉద్యోగం చేయకూడదు అని అనిపిస్తుందేమో.ఇంతకీ ఈ సంధ్యా తన్వర్ ఎవరు అని అనుకుంటున్నారా.

సంధ్యా తన్వర్ ఏ ఎన్-32 పైలట్ ఆశిష్ తన్వర్.ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లోని మెచుకాలోని వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన ఏఎన్-32 విమానం 12 మంది తో బయలుదేరింది.

అయితే బయలు దేరిన కొద్దిసేపటికే ఆ విమానం జాడ తెలియకుండా పోయింది.అయితే ఈ ఘటన జరిగి మూడు రోజులు అయిపోయినా ఇంకా ఆ విమానం జాడ మాత్రం తెలియలేదు.

అయితే విమానం లో ఆశిష్ తన్వర్ పైలట్ గా ఉండగా, ఆయన భార్య సంధ్యా తన్వర్ ఆరోజు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విధుల్లో ఉన్నారు.అయితే ఆశిష్ నడుపుతున్న విమానం అనుకోని ప్రమాదంలో చిక్కుకోవడం దానికి భార్యే ప్రత్యక్ష సాక్షి కావడం సంధ్యా ను మరింత బాధకు గురిచేస్తుంది.

గతఏడాదే ఆశిష్ తన్వర్,సంధ్యా తన్వర్ ల వివాహం జరిగింది.

భర్త విమానం నడిపే పైలట్ భార్

కేవలం పెళ్ళైన ఏడాది కే ఇలాంటి అనుభవాన్ని సంధ్యా ఎదుర్కోవాల్సి వచ్చింది.విమానంతో పాటు అందులో ప్రయాణిస్తున్న వారి జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.హరియాణా రాష్ట్రం పల్వాల్‌లోని దీఘోట్ గ్రామానికి చెందిన ఆశీష్ బీటెక్ పూర్తి చేసి 2013లో భారత వాయుసేనలో చేరారు.అయితే ఈ విమాన జాడ కోసం అధికారులు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.ఏఎన్-32 విమానం ఈ విధంగా మిస్ అవ్వడం ఇదే తొలిసారి ఏమీ కాదు.గతంలో కూడా రెండు మూడు సార్లు ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.ఇంజన్ లోపమా మరేదైనా కారణమో తెలియదు కానీ 2016 లో కూడా ఏఎన్-32 విమానం మిస్ అయ్యింది.

ఇప్పటికీ దాని జాడ తెలియలేదు అనే చెప్పాలి.అయితే ఆ సమయంలో ఆ విమానం లో ప్రయాణిస్తున్న 29 మంది మృతి చెందినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు కూడా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube