ఇప్పటికీ నాకు ఇష్టమైన సినిమా అదే.. తమన్నా?

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో గత దశాబ్ద కాలం నుంచి అగ్రతారగా కొనసాగుతున్న వారిలో మిల్క్ బ్యూటీ తమన్నా ఒకరు.ఈమె తెలుగు తమిళ చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

 Still Its My Favorite Movie Tamanna Details,  Tamanna, Tollywood, Heroine, Favor-TeluguStop.com

ఇక తమన్నా కేవలం తెరపై మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లో నటిస్తూ విశేష ఆదరణ దక్కించుకున్నారు.అలాగే బుల్లితెరపై మాస్టర్ చెఫ్ కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు.

ఇలా వరుస అవకాశాలతో బిజీగా ఉన్న తమన్నా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ తన అభిమానుల సంఖ్య పెంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా తమన్నాతో ముచ్చటిస్తూ తనకు ఇష్టమైన సినిమా ఏంటి అని ప్రశ్నించగా ఆమె సమాధానం చెబుతూ తనకు ఎప్పటికీ ది మమ్మీ సినిమా ఆల్ టైం ఫేవరేట్ మూవీ అని చెప్పుకొచ్చారు.

Telugu Bhola Shankar, Favorite, Tamanna, Tamanna Bhataia, Mummy, Tollywood-Movie

ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే మాస్ట్రో ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 సీక్వెల్ చిత్రం ఎఫ్ 3 లో నటిస్తున్నారు.అదేవిధంగా మెగాస్టార్ భోళా శంకర్   సినిమాలో మెగాస్టార్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.ఇది వరకే తమన్నా మెగాస్టార్ సరసన సైరా నరసింహారెడ్డి చిత్రం ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన విషయం తెలిసిందే.త్వరలోనే భోళా శంకర్ సినిమా షూటింగ్ ల్లో  పాల్గొననున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube