ఆచార్య లో ఆమె కూడా కాదంటగా.....  

Still Heroine Is Not Deciding Megastar Chiranjeevi Acharya Movie -

టాలీవుడ్ లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు.

 Still Heroine Is Not Deciding Megastar Chiranjeevi Acharya Movie

అయితే ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ చిత్ర షూగ్టిం మొదలు పెట్టినా హీరోయిన్ విషయంలో మాత్రం సరైన స్పష్టత ఇవ్వడం లేదు.కాగా ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు ఇటీవల ఓ సందర్భంలో నోరుజారి చెప్పుకొచ్చాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే హీరోయిన్ విషయంలో పలు వార్తలు నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.ఇందులో ఈ చిత్రాన్ని మొదలుపెట్టినప్పుడు దర్శకుడు కొరటాల శివ ముందుగా కోలీవుడ్ బ్యూటీ త్రిషని  తీసుకున్నప్పటికీ ఆమె అనివార్య కారణాలవల్ల ఈ చిత్రం నుంచి తప్పుకుంది.

ఆచార్య లో ఆమె కూడా కాదంటగా…..-Latest News-Telugu Tollywood Photo Image

అయితే అప్పటి నుంచి ఈ చిత్రంలో నటించేటువంటి హీరోయిన్ల విషయంలో తీవ్ర సందిగ్దత నెలకొంది.అయితే ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్, అనుష్క వంటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా తెరపైకి ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాక ఇప్పటికే దర్శకుడు ఈ విషయమై విద్యా బాలన్ ని సంప్రదించినట్లు సమాచారం.

అయితే గతంలో విద్యాబాలన్ నందమూరి బాలకృష్ణ నటించినటువంటి ఎన్టీఆర్ కథానాయకుడు మరియు మహానాయకుడు చిత్రాల్లో అన్నగారు నందమూరి తారక రామారావు భార్య బసవతారకం పాత్రలో నటించింది.అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోకపోయినప్పటికీ విద్యాబాలన్ పాత్రకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.అందువల్ల దర్శకుడు కొరటాల శివ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.అయితే మరి ఈ విషయంపై దర్శకుడు కొరటాల శివ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరి ఇప్పటికైనా ఆచార్య చిత్రంలో మెగాస్టార్ సరసన నటించే హీరోయిన్ ఎవరో చెబితే ఇలాంటి వార్తలకు పుల్ స్టాప్ పడుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Still Heroine Is Not Deciding Megastar Chiranjeevi Acharya Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test