డేటా చోరీపై కేసులో సైబర్ నిపుణుల సహాయం తీసుకుంటున్నాం! స్టీఫెన్ రవీంద్ర!

ఏపీలో ప్రజల వ్యక్తిగత సమాచారం సేవా మిత్ర యాప్ సాయంతో ఐటీ గ్రిడ్ అనే సంస్థ దొంగిలించి స్వప్రయోజనాలకి, ఒక పార్టీ ప్రయోజనాలకి ఉపయోగిస్తుంది అనే నమోదైన కేసులపై తెలంగాణ ప్రభుత్వం సిట్ విచారణకి ఆదేశించిన సంగతి తెలిసిందే.స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యుల బృందం డేటా చోరీ కేసులో విచారణ మొదలెట్టింది.

 Stifen Ravindra Press Meet On Data Theft Case-TeluguStop.com

దీనిపై స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసి.కేసు వివరాలు తెలియజేసే ప్రయత్నం చేసారు.

సేవా మిత్ర యాప్ లో ప్రజలకి సంబంధించిన వ్యక్తిగత డేటా చాలా వుందని మా దర్యాప్తులో తెలిసింది అని స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.

ఇక ఈ కేసులో మరింత లోతుగా క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలంటే సైబర్ నిపుణుల అవసరం ఉంటుందని, వారి సాయం తీసుకొని ఈ కేసుని మరింత విచారణ చేయాల్సిన అవసరం వుందని రవీంద్ర తెలియజేసారు.

ఇక ఈ కేసులోకి సంబంధించిన డేటాని అమెజాన్ నుంచి ఇంకా రావాల్సి వుందని, అది వచ్చిన తర్వాత మరింత లోతుగా అధ్యయనం చేస్తామని, అలాగే ఐటీ గ్రిడ్ వ్యవస్థాపకుడు అశోక్ ని కూడా అదుపులోకి తీసుకొని విచారించి కోర్ట్ ముందు హాజరుపరుస్తామని, ఈ కేసుని నిస్పక్షపాతంగా దర్యాప్తు చేసి అన్ని నిజాలు బయటపెడతాం అని రవీంద్ర తెలియజేసారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube