వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయిన స్టీవెన్ జాబ్స్ దరఖాస్తు..!

ఎవరు కూడా పుట్టడంతోనే ధనవంతులు కాలేరు.ఏదో అమ్మా నాన్న, తాత ముత్తాతలు సంపాందించిన ఆస్థి ఏదన్నా ఉంటే తప్పా గాని, లేదంటే ప్రతి ఒక్కరు కూడా కింది స్థాయిలో నుంచి పై స్థాయిలోకి వెళ్లిన వాళ్ళే.

 Steven Jobs Who Was Sold At Auction For A Huge Price Applied-TeluguStop.com

ప్రతి ఒక్కరిలోనూ ఎదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది.దానిని సరైన సమయంలో ఉపయోగిస్తే విజయం మీ సొంతం అవుతుంది.

అయితే ఒక్కసారిగా కోటీశ్వరుడు అవ్వాలంటే ఎలా చెప్పండి.జీవితం అంటేనే ఆటుపోటులు.

 Steven Jobs Who Was Sold At Auction For A Huge Price Applied-వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయిన స్టీవెన్ జాబ్స్ దరఖాస్తు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొన్నిసార్లు అదృష్టం వెంటనే వరిస్తుంది., మరి కొన్ని సార్లు కొంచెం లేట్ గా వస్తుంది.

కానీ మనలో టాలెంట్ ఉంటే ఎప్పటికన్నా మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది.అలాంటి ఒక వ్యక్తి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.

స్టీవ్ జాబ్స్.ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా.ఆయన మరెవరో కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానములో ఉన్న యాపిల్ సంస్థను స్థాపించిన వ్యక్తి.ఆయన ఈ సంస్థను స్థాపించి చాలా మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి.

అయితే అంతటి పేరు ప్రఖ్యాతలు కలిగిన స్టీవ్ జాబ్స్ గతంలో ఏమి చేసాడు.అసలు ఎక్కడన్నా ఉద్యోగం చేశాడా.? లేదా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూ ఉండవచ్చు.ఆ ప్రశ్నకు సమాధానమే ఈ దరఖాస్తు.

ఆపిల్ సంస్థను స్థాపించనప్పుడు ఆయన ఒక కంపనీలో ఉద్యోగం చేయడానికి గాను ఒక దరఖాస్తును పెట్టుకున్నారట.ఇప్పుడే అదే దరఖాస్తును వేలం వేయగా ఎవరు ఊహించని రీతిలో 3.43 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీ లో అక్షరాలా 2.5 కోట్లుకు అమ్ముడు పోయింది అంట.

Telugu Apple Fonder, Auction, Crores, Social Meida, Steve Job Notification, Viral Latest, Viral News-Latest News - Telugu

స్టీవ్ జాబ్స్ తన 18 ఏళ్ల వయస్సులో అంటే యాపిల్ స్థాపనకు మూడేళ్ల ముందు 1973లో ఒక ఉద్యోగానికి అప్లై చేసారట.ఈ అప్లికేషన్ లో తన చదువుతో పాటు, తనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందని, కానీ ఫోన్ మాత్రం లేదని ఆ అప్లికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది.స్టీవ్ జాబ్స్ కి సంబందించిన ఈ అప్లికేషన్ ను ఆయన సన్నిహితులు ఫిజికల్ అండ్ వెబ్ పేజ్ రూపంలో గత బుధవారం రోజున వేలం పాట వేశారు.కాకపోతే ఈ జాబ్ అప్లికేషన్ కు వేలం నిర్వహించడం ఇది 4వ సారి.2017 సంవత్సరంలో న్యూయార్క్ లో ఈ అప్లికేషన్ ను వేలం వేయగా., మళ్ళీ ఈ ఏడాది మార్చి నెలలో లండన్ లో వేలం వేయగా అక్కడ రూ.1.7 కోట్లు పలికింది.తాజాగా జులై నెలలో వేలం వేయగా 2.5 కోట్లు పలికింది.చిన్న కాగితం ముక్కకి ఇంత డిమాండ్ ఏంటి అని అనుకోకండి.ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలిచిన స్టీవెన్ జాబ్స్ కి సంబంధించిన మొట్టమొదటి దరఖాస్తు అవ్వడం వలన పోటాపోటీగా వేలంపాటలో పాల్గొన్నారు.

#SteveJob #Auction #Apple Fonder #Crores #Social Meida

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు