ఓటుకు నోటు : ఆ ఎమ్యెల్యేకు కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే !     2019-01-07   18:42:56  IST  Sai Mallula

ఓటుకు నోటు కేసుకు ముందు వరకూ స్టీఫెన్‌సన్ అంటే చాలా తక్కువ మందికే తెలుసు. ఆ కేసుతో ఈ ఆంగ్లో-ఇండియన్ పేరు దేశమంతా చర్చనీయాంశం అయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు రేవంత్‌రెడ్డి ఈయనకు లంచం అవ్వబోయి ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఐతే రేవంత్ రెడ్డి వెనక ఉండి… టీడీపీ అధినేత చంద్రబాబే చక్రం తిప్పారన్న వాదన వినిపిస్తోంది.

Stephenson Renominated As Anglo Indian Representative-in Assembly-

Stephenson Renominated As Anglo Indian Representative-in Assembly

చంద్రబాబు నాయుడు దొరికి పోవడానికి కారణమైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్సన్ కు మళ్లీ ఎమ్మెల్యే పదవి దక్కింది. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి మహమూద్ ఆలీ తో కూడిన మంత్రివర్గం సమావేశం అయి ఈ మేరకు తీర్మానం చేసి గవర్నర్ కు పంపించారు.ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంత్రివర్గం అభినందించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశంసించింది. ఎన్నికైన సభ్యులకు రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనల ప్రతులను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో పుస్తకాలు, బుక్‌లెట్ల రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు.