ప్రస్తుత కాలంలో కొందరు డబ్బు మరియు ఆస్తులు వంటి వాటిపై ఉన్న మోజు కారణంగా తమ సొంత వాళ్ళ పైనే దారుణాలకు పాల్పడుతూ కటకటాల పాలవుతున్నారు.తాజాగా ఓ మహిళ తన సవతి కూతురుకి ఆస్తి మొత్తం దక్కుతుందని ఆమెపై తన కన్న కొడుకుతో దారుణంగా అత్యాచారం చేయించిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి జరిగినటువంటి ఓ ప్రాంతంలో నివాసముంటున్న ఓ వివాహిత భర్త ఇటీవలే అనారోగ్య కారణంగా చనిపోవడంతో తన కుటుంభం పెద్దల నిర్ణయం ప్రకారం స్థానికంగా ఉన్నటువంటి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.అయితే అప్పటికే ఆ వ్యక్తికి పెళ్లయి ఒక కొడుకు కూడా ఉన్నాడు.
అయితే ఈమ ధ్య మహిళ కూతురుకి 19 సంవత్సరాలు నిండడంతో తన తండ్రి పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను మర్పించారు.దీంతో ఆమె ఆస్తి పై కన్నేసిన సవతి తల్లి ఎలాగైనా ఆస్తిని చేజిక్కించుకోవాలని పన్నాగం పన్నింది.
ఇందులో భాగంగా తాజాగా యువతిని పని నిమిత్తమా బయటకు తీసుకెళ్లి ఆమెపై తన కన్న కొడుకుతో అత్యాచారం చేయించింది.అంతటితో ఆగకుండా ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే తన తల్లిని, తనని దారుణంగా హత్య చేస్తామని బెదిరించారు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురై నటువంటి యువతి ఆత్మ హత్యాయత్నం చేసింది.విషయం తెలుసుకున్న పోలీసులు యువతి స్పృహలోకి రాగానే విచారించగా ఆస్తి కోసం తన సవతి తల్లి చేసినటువంటి నిర్వాకం గురించి బయట పెట్టింది.
దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు సవతి తల్లిని మరియు ఆమె కొడుకుని అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు.