టీమిండియా బౌలింగ్ కౌచ్ పదవి కావాలన్న స్టెయిన్..!

సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ క్రికెట్ రంగంలో ఒక మెరుపు మెరిసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు.స్టెయిన్ అధికారికంగా క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ.

 Stein Wants To Be Team India Bowling Coach-TeluguStop.com

క్రికెట్ పై తనకున్న మక్కువను మాత్రం చంపుకోలేకపోతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అన్ని మ్యాచ్‌లను వీక్షిస్తూ వాటిపై తన అభిప్రాయాలను తెలుపుతున్నారు.

ముఖ్యంగా భారత క్రికెట్ జట్టు ఆడుతున్న అన్ని మ్యాచ్‌లను ఆయన ఇష్టంగా చూస్తున్నారు.ఈ క్రమంలోనే భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలు చెయ్యాలని ఉందంటూ తన కోరికను బహిర్గతం చేశారు.

 Stein Wants To Be Team India Bowling Coach-టీమిండియా బౌలింగ్ కౌచ్ పదవి కావాలన్న స్టెయిన్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఒక స్పోర్ట్స్ ఛానల్ తన ఇన్‎స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్టు షేర్ చేసింది.ఈ పోస్ట్ కింద స్టెయిన్.

టీమిండియా బౌలింగ్ కోచ్‎గా నన్ను తీసుకోండి అని కామెంట్ పెట్టారు.దీంతో భారత జట్టుకు బౌలింగ్ కోచ్‎ పదవి కావాలని స్టెయిన్ తపన పడుతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ ఇన్‎స్టాగ్రామ్ వేదికగా ఒక ప్రశ్న వేసింది.బీసీసీఐ ఎంఎస్ ధోనీని టీ20 వరల్డ్ కప్‎లో టీమిండియాకు మెంటరుగా నియమించిన విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.ఒకవేళ మీకు ధోనీతో ఫోన్ మాట్లాడే అవకాశం వస్తే అతనికి మీరు ఏం చెప్తారు? అని ప్రశ్నించింది.ఈ ప్రశ్నకు స్టెయిన్ స్పందిస్తూ.టీం ఇండియా బౌలింగ్ కోచ్‎గా తనను నియమించమని అడుగుతా అని బదులిచ్చారు.

ఇక స్టెయిన్ కెరీర్ గురించి తెలుసుకుంటే.అతను 93 టెస్టులు ఆడి 439 వికెట్ల్ పడగొట్టారు.125 వన్డేల్లో 196 వికెట్లు తీసి రికార్డ్ సృష్టించాడు.ఇక 47 టీ20ల్లో కూడా 64 వికెట్లు తీసి మెరుగైన బౌలర్ గా పేరు తెచ్చుకున్నాడు.

టెస్టు మ్యాచులలో 26 సార్లు.వన్డేల్లో 3 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు.

ఇకపోతే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి నియామక ప్రక్రియ ప్రారంభమైంది.ఇప్పటికే బీసీసీఐ దరఖాస్తులను కూడా ఆహ్వానించింది.

అలాగే ప్రధాన కోచ్‌తో సహా బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ కోసం కూడా అప్లికేషన్లను స్వీకరిస్తుంది.

#Bowler #Team #Team India #Dale Steyn

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube