కూతురికి దూరంగా ఉండటం నావల్ల కాదు... అలియా భట్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆలియా భట్( Alia Bhatt ) ప్రస్తుతం కూతురికి జన్మనివ్వడంతో సినిమాలకు దూరమై కూతురు ఆలనాపాలన చూసుకుంటూ ఇంటిపట్టునే ఉంటున్నారు.గత ఏడాది రణబీర్ కపూర్ ( Ranbir Kapoor) ను వివాహం చేసుకున్నటువంటి ఈమె అదే ఏడాది నవంబర్ నెలలో అమ్మాయికి జన్మనిచ్చారు.

 Staying Away From My Daughter Is Not My Fault Alia Bhatts Comments Are Viral Met-TeluguStop.com

ఇక తమ చిన్నారికి రాహా ( Rahaa )అని నామకరణం కూడా చేశారు.ఇక తన కూతురి ఆలన పాలన చూసుకుంటూ అలియా భట్ ఇంటికే పరిమితమయ్యారు.

ప్రస్తుతం తమ చిన్నారికి ఆరు నెలల వయసు కావడం విశేషం.

పాపకు జన్మనిచ్చిన తర్వాత ఆలియా భట్ తన కూతురితోనే ఉంటూ ఎక్కువ సమయం తనతోనే గడుపుతున్నారు.అయితే ఎప్పుడు కూడా తన కూతురిని విడిచి ఉండలేదట.కానీ తాజాగా అలియా న్యూయార్క్ లో జరిగినటువంటి మెట్ గాలాకు( Met Gala ) అటెండ్ అయ్యారు.

ఈ కార్యక్రమంలో ఈమె ఏకంగా లక్ష ముత్యాలతో పొదిగినటువంటి డ్రెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆలియా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే ఈ కార్యక్రమంలో ఏకంగా నాలుగు రోజులు పాటు పాల్గొన్నారు.

ఇందులో భాగంగానే ఆలియా షేర్ చేసినటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇప్పటివరకు తమ ఆరు నెలల చిన్నారిని తాను 24 గంటలకంటే ఎక్కువగా విడిచి ఉండలేదని అయితే మొదటిసారి ఇలా తన కూతురిని వదిలి నాలుగు రోజులపాటు దూరంగా ఉండటం తనకు చాలా బాధ కలిగిస్తుందని తెలిపారు.ఈ విధంగా తమ చిన్నారిని వదిలి ఉండటం తన వల్ల కాలేదు అంటూ తన బాధను బయటపెట్టారు.

ఉదయం లేవగానే తన చిన్నారికి ఫోన్ చేసి తనని చూస్తున్నానని తన కూతురిని చాలా మిస్ అవుతున్నాను అంటూ ఈ సందర్భంగా ఆలియా తన కూతురిపై ఉన్నటువంటి ప్రేమను తనని విడిచి ఉండడం వల్ల కలిగే బాధను బయటపెట్టారు.ఇలా అలియా చేసిన ఈ కామెంట్స్ పై నెటిజన్స్ స్పందిస్తూ కూతురిని విడిచి ఉండలేనటువంటి ఆలియా కొంపదీసి సినిమాలకు గుడ్ బై చెబుతారా ఏంటీ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube