ఆ ఒక్క కారణంతోనే బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్నా: నాగచైతన్య

అక్కినేని వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి జోష్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.ఇకపోతే తాజాగా ఈయన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్దా అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

 Staying Away From Bollywood Movies For That Reason Alone Naga Chaitanya Naga Cha-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఈ క్రమంలోనే నాగచైతన్య సైతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో హాజరవుతున్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నాగచైతన్యకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.తను బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించారు.

ఇక ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ తాను చెన్నైలో పుట్టానని హైదరాబాదులో పెరిగానని తెలిపారు.ఇక తను హిందీలో పర్ఫెక్ట్ కాకపోవడంతో తాను హిందీ సినిమాలు చేయడానికి ఇష్టపడటం లేదని తనకు వచ్చిన అవకాశాలను కూడా రిజెక్ట్ చేసినట్లు ఈయన వెల్లడించారు.

Telugu Ameer Khan, Naga Chaitanya, Tollywood-Movie

ఇకపోతే లాల్ సింగ్ చడ్డా సినిమాకి కూడా ముందుగా నో చెప్పానని అయితే ఈ సినిమాలో తన పాత్ర దక్షిణాది నుంచినార్త్ ఇండియా వెళ్లిన ఓ కుర్రాడి పాత్రలో కనిపిస్తానని అయితే తెలుగుదనం కనిపించేలా మధ్య మధ్యలో తెలుగు పదాలను కూడా ఉపయోగించినట్లు ఈ సందర్భంగా నాగచైతన్య లాల్ సింగ్ చద్దాగురించి, తాను బాలీవుడ్ సినిమాలను రిజెక్ట్ చేయడానికి కూడా కారణాలను తెలిపారు.నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube