సీఎం రూపంలో దుర్గామాత విగ్ర‌హాలు.. భ‌గ్గుమంటున్న హిందువులు

మ‌న దేశంలో హిందువుల పండులు అంటే ఎంత గ్రాండ్ గా జ‌రుగుతాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎక్కువ‌గా దసరా ఉత్సవాలు అంటే అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతాయి.

 Statues Of Durgamata In The Form Of Cm .. Hindus Falling.., Durgamata, Mamatha B-TeluguStop.com

ఒక ర‌కంగా చెప్ప‌నాలంటే దుర్గామాత ఉత్స‌వాలు అంటే మ‌న‌కు ప్ర‌ధానంగా ఈ రాష్ట్ర‌మే గుర్తుకు వ‌స్తుంది.హిందువుల సంస్కృతితో బెంగాల్ ఎప్పుడూ ముందు వ‌రుస‌లోనే ఉంటుంది.

దసరా ఉత్సవాల‌ను రాజ‌కీయ నాయ‌కులు కూడా ఉప‌యోగించుకుంటారంటే వీటికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం అవుతోంది.

అంతెందుకు మొన్న‌టికి మొన్న జ‌రిగిన బెంగాల్ ఎన్నిక‌ల్లో ఈ రాష్ట్ర సామాజిక రాజకీయ అంశాలు ఆధార‌ప‌డ్డాయి.

వీటిని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ త‌న త‌న రాజ‌కీయ నినాదంగా కూడా మార్చేయ‌డం పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మ‌నే చెప్పాలి.ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ నేత‌లు జైశ్రీరామ్ అని నిన‌దిస్తే ఇప్ప‌టి సీఎం మమతా బెనర్జీ మాత్రం అందుకు భిన్నంగా బెంగాళీల ఐక్య‌త‌కు గుర్తుగా జై కాళీ మా అని నినాదం ఇవ్వ‌డంతో ఆమెకు అధికారం కూడా ద‌క్కింది.

బీజేపీ దేశ‌వ్యాప్తంగా వినియోగించిన జై శ్రీరామ్ నినాదాన్ని ఒక్క బెంగాల్‌లోనే జై కాళీ మా నినాదం ఎదుర్కొంద‌నే చెప్ప‌క త‌ప్ప‌దేమో.

Telugu Bengal Poltics, Bjp, Durga Matha, Durgamata, Hindus, Mamatha Benarjy-Late

అయితే ఇక మమత అభిమానులు మ‌రో అడుగు ముందుకు వేసి ఈ సారి దసరా ఉత్సవాలు గ్రాండ్ గా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.ఇందులో భాగంగా ఈసారి ఏకంగా అమ్మవారి విగ్రహాల్లో మమత రూపురేఖలు దిద్దుతూ ఆ విధంగానే విగ్ర‌హాల‌ను త‌యారు చేస్తున్నారు.ఇందుకోసం ప్ర‌త్యేకంగా కొన్ని కమిటీలు కూడా వేశారు.

అంటే దుర్గామాత విగ్రహాల్లో క‌చ్చితంగా సీఎం మమతా బెన‌ర్జీ విగ్ర‌హాన్ని పెట్ట‌డ‌మే వీరి ప‌ని అన్న‌మాట‌.అయితే దుర్గామాత అంటే దేశ వ్యాప్తంగా హిందువులు కొలిచే దేవత కావ‌డంతో ఇప్ప‌నుడు ఆమెను అవ‌మానించారంటూ నిర‌స‌న‌త‌లు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube