ఈ వయస్సు వారందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్రాలు.. !

దేశంలో ప్రస్తుత పరిస్దితుల్లో హాట్ టాపిక్‌గా మారిన అంశం ఏంటంటే కోవిడ్ విషయం అని చెప్పవచ్చు.సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్ అవుతున్న కరోనా వార్తలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

 Free Vaccine To 18years Above Age, Uttar Pradesh, Assam, Madhya Pradesh, Chhatti-TeluguStop.com

అసలు దేశంలో కరోనా వల్ల ఎలాంటి పరిస్దితులు ముందు ముందు ఎదుర్కొన వలసి వస్తుందో ఊహించడం కష్టంగా మారింది.ఒకరకంగా కోవిడ్ విజృంభన అనేది చేయిదాటినట్లుగా కనిపిస్తుందనే గుసగుసలు కూడా ప్రజల్లో మొదలు అయ్యాయట.

ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేసే పక్రియలో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా అందజేసేందుకు అనుమతి ఇచ్చింది.

అంతే కాకుండా ఈ వ్యాక్సిన్లను నేరుగా టీకా తయారీ సంస్థల వద్దే కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది.

ఇకపోతే ఇప్పటి వరకు కుటుంబంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా కొందరు టీకాలకు దూరంగా ఉంటున్న విషయాన్ని గమనించిన కొన్ని రాష్ట్రాలు ఎవరూ టీకాకు దూరం కావొద్దని భావించి 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని నిర్ణయించాయి.

అలా ప్రకటించిన రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్‌, అసోం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube