ఎక్కడపడితే అక్కడ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టొద్దంటున్న స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా...  

మనం సాధారణంగా ప్రయాణించే సమయంలో మన ఫోన్ లో ఉన్న ఛార్జింగ్ కాలీ అయ్యిందంటే ఎక్కడో ఒక్కచోట ఫోన్ కి ఛార్జింగ్ పెట్టేస్తుంటాం.అయితే ఇలా చేయడంతో మన ఫోన్ లోని డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుందంటూ తాజాగా స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా సంస్థ హెచ్చరించింది.

 Statebankofindia Phone Charging-TeluguStop.com

ఇందుకు సంబందించిన వీడియోని కూడా ఎస్బీఐ బ్యాంకు విడుదల చేసింది.ఇందులో భాగంగా మన స్మార్ట్ ఫోన్ ని ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ చేసుకోవద్దని, ఒకవేళ ఫోన్ ని ఎక్కడపడితే ఛార్జింగ్ చేస్తే హ్యాకర్లు తమ వైరస్ సాఫ్ట్ వేర్ల ద్వారా ఫోన్ లోకి చొరబడి ఫోన్లో విలువైన డేటాను దొంగిలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. 

Telugu Careful Phone, Phone, Bank India, Unsecured Phone-Latest News - Telugu అలాగే సెక్యూర్ కానీ పవర్ స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ చేస్తే మన ఫోన్లోకి మాలవేర్ అనే వైరస్ ని ప్రవేశ పెట్టి హ్యాకర్లు మన ఫోన్లో ఉన్నటువంటి బ్యాంకు అకౌంట్ కి సంబందించిన వివరాలు, పాస్ వర్డ్స్ వంటివి దొంగలించి క్షణాల్లో ఖాతాల్లో ఉన్నటువంటి డబ్బులను కాజేస్తారని సూచించింది.కాబట్టి అత్యవసర సమయాల్లో తప్ప అన్ని సమయాల్లోనూ పవర్ స్టేషన్లను ఛార్జింగ్ కోసం ఉపయోగించరాదని హెచ్చరించింది.ఇంకా వీలైతే సొంత పవర్ బ్యాంకులను ఉపయోగిస్తే మంచిదని సూచించింది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube