మీ స్మార్ట్ మొబైల్ లో అలాంటి డేటా ఉంటే వెంటనే డిలీట్ చేయమంటున్న ఎస్బిఐ..!

ప్రస్తుతం దేశంలో చాలా రకాల ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు.ఆన్లైన్ మోసాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు ఉన్నా సరే కొంతమంది అమాయక ప్రజలను సైబర్ కేటుగాళ్లు నిలువుగా మోసం చేస్తూ డబ్బును సొమ్ము చేసుకుంటున్నారు.

 Sbi Warned Its Customers To Delete Bank Details Related Data From Smart Phones ,-TeluguStop.com

పోలీసులు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న సరే  రోజురోజుకీ ఆన్లైన్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి.అంతేకాకుండా వివిధ రకాలైన కొత్త రకం మోసాలకు పాల్పడుతూ సైబర్ కేటుగాళ్ళు విజృంభిసుతున్నారు .టెక్నాలజీ పెరిగేకొద్ది ప్రతి ఒక్కరు కూడా వారి మొబైల్ ద్వారా బ్యాంకింగ్ కు సంబంధించన యాప్స్ ను ఉపయోగించి బ్యాంకింగ్ సేవలను అన్నిటినీ కూడా ఉపయోగించుకుంటున్నారు.ఈ క్రమంలో ఆర్బిఐ సహా చాలా బ్యాంకులు వారి కస్టమర్లకు ఎప్పటికప్పుడు ఆన్లైన్ మోసాలపై హెచ్చరికలు జారీ చేస్తున్న కానీ  మోసాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

దీంతో అప్రమత్తమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.

బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని మీ స్మార్ట్ ఫోన్ లో ఎట్టిపరిస్థితిలో ఉంచవద్దని కస్టమర్లకు తెలియచేసింది.

ప్రస్తుత  కాలంలో బ్యాంకింగ్ మోసాలు అధిక స్థాయిలో నమోదు అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఎవరైనా సరే మీ స్మార్ట్ఫోన్ లో బ్యాంకింగ్ పిన్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ సమాచారము, లాగిన్  పాస్వర్డ్ నెంబర్లు లాంటివి సైబర్ కేటుగాళ్లు చేతికి పడినట్లే అని కస్టమర్లకు ఎస్బిఐ హెచ్చరించింది.

ఎవరైనా సరే ఈ రహస్య సమాచారాన్ని వారి ఫోన్ లో ఉంచినట్లయితే వెంటనే తొలగించాలని, అంతేకాకుండా మీరు ఉపయోగించే కంప్యూటర్, లాప్ టాప్ లో కూడా ఇలాంటి డేటా ను తొలగించాలని కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని ఎస్బిఐ తెలియజేసింది.బ్యాంకు లావాదేవీలు సంబంధించిన ఇతర ద్వారానే జరుగుతున్న తరుణంలో వీటినే ఆసరాగా చేసుకున్న సైబర్ కేటుగాళ్ళు ప్రజలను నట్టేట ముంచే చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా మరోవైపు సైబర్ కేటుగాళ్లను  కొంతమంది పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు చేపట్టిన కానీ ఆన్లైన్ మోసాలకు మాత్రం అడ్డుకట్ట లేకుండా అయిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube