లోన్ కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త చెప్పింది.దసరా, దీపావళి పండగల నేపథ్యంలో అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.

 Sbi Waives Processing Fees On Loans Via Yono App, Offers Home Loan Interest Rate-TeluguStop.com

కరోనా, లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులను దృష్టిలో ఉంచుకుని వారికి ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంది.ఎస్బీఐ పండుగల సందర్భంగా రిటైల్ రుణాలపై రాయితీలను కల్పించింది.

దేశంలో కరోనా వల్ల డిమాండ్ సంక్షోభం నెలకొనడంతో ఎస్బీఐ యోనో యాప్ ద్వారా వ్యక్తిగత రుణాల కోసం లేదా గోల్డ్ లోన్ రుణాల కోసం దరఖాస్తు చేసిన వారికి పూర్తిస్థాయిలో ప్రాసెసింగ్ ఫీజును మినహాయించనుంది.ప్రాసెసింగ్ ఫీజు రద్దు వల్ల కస్టమర్లకు భారీగా ఆదా కానుంది.

ఎస్బీఐ ఒక ప్రకటన ద్వారా ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో ఇళ్లు కొనుగోలు చేసిన వారికి నూటికి నూరు శాతం ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేయనున్నట్టు పేర్కొంది.

పండుగ వేళ ఎస్బీఐ ప్రకటిస్తున్న ఆఫర్లు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఎస్బీఐ ఎంపిక చేసిన ఖాతాదారులకు వడ్డీ రేట్లలో 10 బేక్ పాయింట్ల రాయితీ కల్పించనున్నట్టు వెల్లడించింది.యోనో యాప్ ను ఉపయోగించి కస్టమర్లు వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు రుణాలకు ఆమోదం పొందవచ్చని వెల్లడించింది.

యోనో యాప్ ఉపయోగించి కారు, గృహ రుణాల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది.

వ్యక్తిగత రుణాలకు 9.6 శాతం వడ్డీ వసూలు చేస్తున్నామని.గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్ల కోసం 7.5 శాతం వడ్డీతో రుణం తిరిగి చెల్లించే సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొంది.గోల్డ్ లోన్ తీసుకున్న కస్టమర్లు మూడు సంవత్సరాల్లో రుణాలను తిరిగి చెల్లించే వెసులుబాటును కూడా కల్పిస్తున్నామని వెల్లడించింది.

ఎస్బీఐ అందుబాటులోకి తెచ్చిన ఆఫర్లు రుణాలు తీసుకోవాలనుకునే వాళ్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube