యెస్ బ్యాంక్ ను సొంతం చేసుకున్న ఎస్బీఐ

తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న యెస్ బ్యాంక్ ను ఎస్బీఐ సారధ్యంలోని కన్సార్షియం సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.దీనికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

 State Bank Of India Led Consortium To Takeover Yesbank-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ బోర్డు సమావేశం కూడా గురువారం నిర్వహించినట్లు తెలుస్తుంది.అయితే దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

నిధుల కొరత ఎదుర్కొంటున్న యెస్ బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాదారులెవరూ కూడా తమ ఖాతాల నుంచి నెలకు రూ.50,000 లకు మించి విత్ డ్రా చేసుకోకూడదు అంటూ ఆర్బీఐ తన ఆంక్షల్లో పేర్కొంది.దీనితో యెస్ బ్యాంక్ ఖాతాదారులు ఆందోళనలో పడ్డారు.

దీనితో యెస్ బ్యాంక్ ను ఎస్బీఐ సొంతం చేసుకోవడం తో ఖాతాదారులకు కొంత ఊరట లభించనుంది.

ఇప్పటివరకు ఆర్బీఐ విధించిన ఆంక్షలతో యెస్ బ్యాంక్ పరిస్థితి మరింత సంక్షోభంలో పడింది.

తదుపరి ప్రకటన వెలువడే వరకు ఆర్బీఐ విధించిన ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.అలాగే బ్యాంక్‌ బోర్డునీ రద్దు చేసి ఎస్‌బీఐ మాజీ సీఎఫ్ఓ ప్రశాంత్‌ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube