SBI డోర్ స్టెప్ బ్యాంకింగ్.. ఎవరికంటే..!

ఖాతాదారులకు ఎస్బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు డోర్ స్టెప్ సర్వీస్ అందించాలని నిర్ణయించుకుంది.

 Sbi డోర్ స్టెప్ బ్యాంకింగ్.. ఎవర�-TeluguStop.com

ఈ క్రమంలో ఎంపిక చేసిన కస్టమర్లకు ఈ అవకాశం ఇస్తున్నారు.కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఖాతాదారులకు మాత్రమే ఎస్బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ లను అందిస్తున్నారు.

అంతేకాదు 70 ఏళ్లకు పైన వయసు కలిగిన సీనియర్ సిటిజన్స్ కు.వికలాంగులకు డోర్ స్టెప్ సర్వీస్ లను అందుబాటులోకి తెస్తున్నారు.అయితే బ్యాంక్ కు చెందిన అన్ని బ్రాంచులు ఈ సేవలను ఆఫర్ చేయవని తెలుస్తుంది.ఎంపిక చేసిన బ్రాంచుల్లోనే ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ ఉంటుందని చెబుతున్నారు.

Telugu Dore Step, Sbi Dorestep, Customers, Bank India-General-Telugu

డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ కోసం రిజిస్టర్ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి.కస్టమర్ బ్యాంక్ బ్రాచుకి 5 కిలోమీటర్ల లోపు నివసించాల్సి ఉంటుంది.జాయింట్ అకౌంట్లు, మైనర్ అకౌంట్లకు డోర్ స్టెప్ సర్వీస్ లు ఉండవు.అయితే అర్హత ఉన్న వారు ఈ డోర్ స్టెప్ సర్వీస్ కోసం మాత్రం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

నాన్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలకు 60 రూ.లు కట్టాలి.డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు కోరుకునే వారు బ్యాంక్ కు వెళ్లి రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది.అయితే ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా క్యాష్ పికప్, డెలివరీ, చెక్ పికప్, డ్రాప్ట్ డెలివరీ, ఫాం 15 హెచ్, టర్మ్ డిపాజిట్ ఇలా పలు రకాల సేవలు ఇంటి దగ్గర నుండే అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube