ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. రోజుకు లక్ష రూపాయలు?  

state bank of india good news to bank customers SBI, 100000, Withdrawl, SBI Platinum Debit Card, SBI Metro Card, SBI Classic, Dussara And Diwali Offers, SBi Customers - Telugu 100000, Dussara And Diwali Offers, Sbi, Sbi Classic, Sbi Customers, Sbi Metro Card, Sbi Platinum Debit Card, Withdrawl

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో ఖాతాదారులకు మేలు జరిగేలా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఎస్‌బీఐ ఖాతాదారులకు వరుస శుభవార్తలు చెబుతోంది.

TeluguStop.com - State Bank Of India Good News Customers

తాజాగా ఎస్‌బీఐ నుంచి మరో కీలక ప్రకటన వెలువడింది.గతంతో పోలిస్తే ఎస్‌బీఐ ఏటీఎం కార్డుల ద్వారా విత్ డ్రా చేసుకునే పరిమితిని భారీగా పెంచింది.

ఇకపై ఎంపిక చేసిన డెబిట్ కార్డుల ఖాతాదారులు ఏటీఎంల నుంచి రోజుకు లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.ఖాతాదారులు డెబిట్ కార్డ్ ఆధారంగా రోజుకు 20,000 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చని కార్డును బట్టి పరిమితిలో మార్పులు ఉంటాయని ఎస్‌బీఐ ప్రతినిధులు తెలిపారు.

TeluguStop.com - ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. రోజుకు లక్ష రూపాయలు-Business - Telugu-Telugu Tollywood Photo Image

ఎస్‌బీఐ ప్లాటినం డెబిట్ కార్డును వినియోగించే కస్టమర్లు లక్ష రూపాయలు విత్ డ్రా చేసుకోవచ్చు.

ఎస్‌బీఐ క్లాసిక్, ఎస్‌బీఐ మెట్రో కార్టులకు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిమితిని పెంచింది.

గతంలో 10,000 రూపాయలు ఉన్న విత్ డ్రా లిమిట్ ను భారీగా పెంచడంపై ఎస్‌బీఐ ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఎస్‌బీఐ డెబిట్ కార్డులపై రుణాలను సైతం మంజూరు చేస్తోంది.

ఖాతాదారులకు సులభమైన ఈ.ఎం.ఐ ఆప్షన్లను అందిస్తోంది.లక్ష రూపాయల వరకు కస్టమర్లు లోన్ పొందే అవకాశం ఎస్‌బీఐ కల్పిస్తోంది.

అయితే ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఎస్‌బీఐ ఈ లోన్ ను అందిస్తూ ఉండటం గమనార్హం.మరోవైపు ఎస్‌బీఐ విత్ డ్రా పరిమిత్ని భారీగా పెంచడంతో ఇతర బ్యాంకులు సైతం విత్ డ్రా పరిమితిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రైవేట్ రంగంలోని బ్యాంకులు పోటీ ఇస్తున్నా కొత్తకొత్త ఆఫర్లతో ఎస్‌బీఐ కస్టమర్లను ఆకర్షిస్తూ ఖాతాదారులను పెంచుకుంటూ ఉండటం గమనార్హం.

#SbiPlatinum #SBI Classic #SBI Metro Card #Withdrawl #100000

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

State Bank Of India Good News Customers Related Telugu News,Photos/Pics,Images..