ఇక నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకౌంట్ ఓపెన్ చేయాలంటే బ్యాంక్ కు వెళ్లాల్సిన పనిలేదు.ఎస్.
బి.ఐ కొత్తగా కస్టమర్ల కోసం వీడియో కేవైసీ ద్వారా ఎకౌంట్ ఓపెనింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది.ఎస్.బీ.ఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనో ఎస్.బీ.ఐ ద్వారా ఈ సేవలను అందుబాటులో ఉంచుతుంది.ఈ కొత్త సేవలు ఎస్.బీ.ఐలో కొత్తగా ఎకౌంట్ తీసుకునేవారికి బ్యాంక్ కు వెళ్లకుండానే సేవింగ్స్ ఎకౌంట్ తీసుకోవచ్చు..
ఎస్.బీ.ఐ యాప్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేయొచ్చు.కరోనా తీవ్రత అధికంగా ఉన్న సందర్భంగా బ్యాంక్ కు వచ్చి కస్టమర్లు ఎకౌంట్ ఓపెన్ చేయడకుండా ఈ సర్వీస్ ను ప్రవేశ పెట్టారు.
ఈ టైం లో ఆన్ లైన్ ఎకౌంట్ ఓపెనింగ్ అత్యవసరమని అందుకే దీన్ని ప్రవేశ పెట్టామని అన్నారు ఎస్.బీ.ఐ చైర్మన్ దినేష్ ఖారా.కొత్తగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా తెరవాలంటే యోనో యాప్ డౌన్ లోడ్ చేసుకుని న్యూ టూ ఎస్.బీ.ఐ ఆప్సన్ ఎంచుకుని ఇన్ స్టా ప్లస్ సేవింగ్ ఎకౌంట్ ఓకే చేయాల్సి ఉంటుంది.ఆధార్ వివరాలతో పాటుగా వ్యక్తిగత వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
వీడియో కాల్ తో కేవైసీ పూర్తైతే కొత్త ఎకౌంట్ ఓపెన్ అయినట్టే.