కెనడాలో భారతీయ టిఫిన్లు.. స్టార్టప్ వినూత్న ఆలోచన, జస్ట్ వన్ క్లిక్ చాలు..!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు.మన ఆహారాన్ని , వంటకాలను మిస్ అవుతున్నారు.ఆయా దేశాల్లో కొన్నిభారతీయ రెస్టారెంట్లువున్నప్పటికీ.ఇంటి రుచిని మిస్సవుతున్నామని ఎందరో ఎన్ఆర్ఐలు చెబుతూ వుంటారు.అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఇప్పుడు అన్ని దేశాలలో భారతీయ రెస్టారెంట్లు పరదేశీయులను కూడా ఆకట్టుకుంటున్నాయి.మన వంటకాల రుచికి వారు కూడా వహ్వా అనాల్సిందే.

 Startup Innovative Idea , Offers Indian Tiffin Service In Canada , Pumpkin Kart-TeluguStop.com

అందుకే ఏ దేశంలో చూసినా మన హోటళ్లు, రెస్టారెంట్లు నిత్యం కిటకిటలాడుతూ వుంటాయి.ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మన భారతీయుల కంటే అక్కడి స్థానికులే ఎక్కువగా ఆ హోటళ్లకు ఎగబడుతున్నారు.

ప్రజల్లో భారతీయ వంటకాలపై వున్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు కెనడాకు చెందిన ఓ స్టార్టప్ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది.భారతీయ టిఫిన్లను ఆన్‌లైన్ ద్వారా అందించాలని నిర్ణయించింది.

కెనడాలో ప్రముఖ గ్రోసరీ డెలివరి సంస్థగా దూసుకెళ్తున్న ‘‘ Pumpkin Kart platform ’’ ఈ సేవలను అందిస్తోంది.ఇంటి రుచిని అందించడంతో పాటు కిరాణా సామాగ్రిని ఏకకాలం అందించాలని ఈ సంస్థ ఇలా ప్లాన్ చేసింది.

ఈ ఏడాది మేలో పంప్‌కిన్ కార్ట్ (పీకే) ద్వారా టిఫిన్ సర్వీస్ ను ప్రారంభించారు.వినియోగదారులకు డిన్నర్, లంచ్ కేటగిరీల కింద మెనూలను అందుబాటులో వుంచింది.కేరళ, పంజాబ్, గుజరాతీ సహా భారత్ లోని అన్ని ప్రాంతాల్లో ప్రఖ్యాతి గాంచిన వంటకాలను మెనూలో పొందుపరిచారు.

Telugu Canada, Gujarati, Indian, Indian Tiffin, Kerala, Philip Correia, Punjab,

పంప్‌కిన్ కార్ట్ సీఈవో ఫిలిప్ కొర్రేయా మాట్లాడుతూ.గ్రేటర్ టొరంటో నగర జనాభాలో దాదాపు 60 శాతం మంది వలసదారులేనని చెప్పారు.వీరిలో ఎక్కువశాతం భారతీయ సంతతి వారేనని అందువల్ల టిఫిన్ సర్వీస్ ను టోరంటోలో అందిస్తున్నట్లు తెలిపారు.

హెల్త్ కెనడా సర్టిఫైడ్ కిచెన్లకు ఇందులో భాగస్వామం కల్పించారు.అలాగే హోమ్ చెఫ్ లు ఈ ప్రొఫెషనల్ కిచెన్లలలోకి ప్రవేశించి వినియోగదారులకు భోజనాన్ని తయారుచేస్తారు.

ఈ సౌకర్యాన్ని భవిష్యత్తులో టోరంటోలో సమీప ప్రాంతాలకు విస్తరిస్తామని సీఈవో తెలియజేశారు.కెనడాలోని బంధువుల కోసం భారత్ లోని కుటుంబాలు నెలవారీ భోజన ప్యాకేజీలను కొనుగోలు చేయడానికి అనుమతిస్తున్నామని ఫిలిప్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube