క్లాప్ కొట్టిన మోహన్ బాబు,వెబ్ సిరీస్ షురూ  

Started Manchu Vishnu Web Series-

హీరో శ్రీకాంత్ తో మంచు విష్ణు నిర్మాతగా ప్రారంభమైన చిత్రానికి నటుడు మోహన్ బాబు తోలి క్లాప్ ని కొట్టారు.ఇంతకీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఏంటి అని ఆలోచిస్తున్నారా.అదేనండీ ఇప్పుడు చాలా చాలా డిమాండ్ ఏర్పడిన వెబ్ సిరీస్..

Started Manchu Vishnu Web Series--Started Manchu Vishnu Web Series-

మంచు విష్ణు నిర్మాతగా చదరంగం పేరుతొ ఒక వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నాడు.దీనిలో హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.అయితే ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలు కూడా జరుపుకొని తాజాగా తోలి క్లాప్ ని కూడా అందుకుంది.

మోహన్ బాబు శ్రీకాంత్ పై తోలి క్లాప్ ఇవ్వగా,మరికొద్ది రోజుల్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం సినిమాలకు ఎంత డిమాండ్ ఉందో, వెబ్ సిరీస్ లకు కూడా ఆ మేరకే డిమాండ్ పెరిగిపోయింది.అటు హాలీవుడ్,బాలీవుడ్ ల నుంచి కూడా ఈ వెబ్ సిరీస్ లపైనే అందరూ పడ్డారు.

ఈ వెబ్ సిరీస్ చిన్నా చితక ఆర్టిస్టులు ఎవరూ ఉండడం లేదు అందరూ కూడా స్టార్స్ నటిస్తుండడం విశేషం.రీసెంట్ గా ఓ బేబీ తో మంచి హిట్ కొట్టిన సమంత కూడా ఒక వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి.ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరూకూడా సినిమాల పైన కంటే వెబ్ సిరీస్ లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.