బిట్‌కాయిన్‌ @ 100.. ఎప్పుడైనా అమ్మొచ్చు!

ఈ మధ్య బిట్‌ కాయిన్ల విక్రయాలు పెరిగాయి.చాలా మంది వీటిని కొనడానికి ఉత్సాహం చూపుతున్నారు.

 Start Earning With Just Hundred By Investing In Bitcoin-TeluguStop.com

కానీ, దీని గురించి తెలిసిన వారు చాలా తక్కువే.అయితే, కేవలం రూ.100 కే బిట్‌కాయిన్‌ ఎలా కొనాలో తెలుసుకుందాం.ఈ ఏడాది క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ విలువ చాలా పెరిగింది.ఆ కాయిన్‌ విలువ ఇప్పుడు రూ.28,47,384.అంత డబ్బు పెట్టి కొనడం అందరి వల్లా కాదు.అలా అయితే సామాన్య ప్రజలు కూడా బిట్‌ కాయిన్లు కొనుక్కునే అవకాశం లభిస్తోంది.ఇది యాక్సిస్, ఐసీఐసీఐ డైరెక్ట్, పేటీఎం మనీ లాంటిదే. కేవలం రూ.100 తోనే బిట్‌ కాయిన్‌ కొనవచ్చు.కాయిన్‌ విలువ పెరిగితే మన పెట్టుబడి విలువ కూడా పెరుగుతుంది.

పూర్తి కాయిన్‌ మనకు దక్కకపోవచ్చు కానీ, మనం పెట్టుబడి పెట్టిన దానిలో కొంత మేర దక్కుతుంది.

 Start Earning With Just Hundred By Investing In Bitcoin-బిట్‌కాయిన్‌ @ 100.. ఎప్పుడైనా అమ్మొచ్చు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాధారణంగా బిట్‌ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా ఎక్సెజ్‌లు అందుబాటులో ఉన్నాయి.అందులో http//:www.wazirx.com ఒకటి.దీంతో కేవలం రూ.100 కే బిట్‌ కాయిన్‌ ట్రేడ్‌ చేసే అవకాశం ఉంది.దీనికోసం వెబ్‌సైట్‌లోకి వెళ్లి సైన్‌ అప్‌ అవ్వాల్సి ఉంటుంది.

అక్కడ మీ పేరు, మొబైల్‌ నంబర్, ఈమెయిల్‌ ఐడీ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఆ తర్వాత కేవైసీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

అంటే ఆధార్‌ నంబర్, ప్యాన్‌ కార్డ్‌ నంబర్‌ వివరాలు ఇవ్వాలి.దీంతో మీ పూర్తి వివరాలు వజీర్‌ ఎక్స్‌ సైట్‌కి చేరతాయి.

అప్పుడే మీకు ట్రేడింగ్‌ చేసేందుకు అవకాశం కల్పిస్తారు.దీనికోసం మీరు వజీర్‌ ఎక్స్‌ సైట్‌లోని మీ అకౌంట్‌లో కొంత మొత్తం దాచుకోవాల్సి ఉంటుంది.కనీసం రూ.100 వేస్తే ఆ రూ.100తో మీరు బిట్‌ కాయిన్‌ పై ట్రేడింగ్‌ మొదలుపెట్టవచ్చు.

ప్రతి రోజూ మీరు పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం వచ్చిందో తెలుసుకోవచ్చు.కానీ, ప్రతి రోజూ లాభమే వస్తుందనేందుకు గ్యారెంటీ లేదు.బిట్‌ కాయిన్‌ విలువ పెరిగితే మీరు పెట్టిన పెట్టుబడికి ఎంతో కొంత లాభం వస్తుంది.

అదే బిట్‌ కాయిన్‌ విలువ తగ్గితే, మీరు పెట్టిన పెట్టుబడిలో కొంత నష్టపోవాల్సి ఉంటుంది.అందుకు సిద్ధమైతేనే ఈ ట్రేడింగ్‌ చెయ్యవచ్చు.లేకుంటే వదిలేయడం బెటర్‌.బిట్‌ కాయిన్‌ టాప్‌ పొజిషన్‌ లో ఉంది.

ప్రపంచంలో బిలియనీర్లు చాలా మంది బిట్‌ కాయిన్లలో పెట్టుబడులు పెడుతున్నారు.అందువల్ల దాని ధర పెరుగుతోంది.

ఫలితంగా పెట్టుబడి పెట్టిన వారికి దీర్ఘ కాలంలో లక్షలు, కోట్లలో లాభాలు వస్తున్నాయి.వచ్చే పదేళ్లలో బిట్‌ కాయిన్‌ప్రపంచాన్ని ఏలడం ఖాయం అంటున్నారు నిపుణులు.

#Bitcoin #Stock Exchange #Investment #Cryptocurrency

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు