టీవీ, సీరియల్స్ లో నటించి నేడు స్టార్స్ గా ఉన్న హీరోలు వీరే..!

సినిమాల్లోకి రావడానికి మంచి మార్గం బుల్లి తెర.ముందు టీవీలో కనిపిస్తే.

 Stars Who Worked Before In Tv Industry-TeluguStop.com

ఆ తర్వాత సినిమాల్లో కచ్చితంగా అవకాశం వస్తుందని చాలా మంది నటుల అభిప్రాయం.అందుకే పలువురు టాప్ నటులు టీవీని బేస్ చేసుకుని సినిమాల్లోకి అడుగు పెట్టారు.

టీవీ షోలు, సీరియల్స్ చేసి.ఆ తర్వాత వెండితెర పైకి ఎంట్రీ ఇచ్చారు.అలా వచ్చి సూపర్ స్టార్ గా ఎదిగిన నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 Stars Who Worked Before In Tv Industry-టీవీ, సీరియల్స్ లో నటించి నేడు స్టార్స్ గా ఉన్న హీరోలు వీరే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

షారుక్ ఖాన్

ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ తన కెరీర్ ను టీవీ నుంచే ప్రారంభించారు. దిల్ దరియా అనే సీరియల్ లో షారుక్ మొదటగా నటించాడు.అందులో ప్రాధాన్యత లేని క్యారెక్టర్ చేశాడు.

ఆ తర్వాత పలు సీరియల్స్ లో చేసి.దీవానా అనే సినిమా ద్వారా వెండి తెరపై కనిపించాడు.

సుశాంత్ సింగ్

పవిత్ర రిష్తా అనే సీరియల్ ద్వారా నటనా కెరీర్ మొదలు పెట్టాడు.ఇందులో మానవ్ అనే క్యారెక్టర్ చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకున్నాడు.అనివార్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇర్ఫాన్ ఖాన్

దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్< సైతం టీవీ నుంచే సినిమాల్లోకి వచ్చాడు.అనంతరం హాలీవుడ్ లోనూ నటించాడు.చాణక్య, చంద్రకాంత లాంటి 10 టాప్ సీరియల్స్ లో ఆయన నటించారు.రోగ్ సినిమాతో బాలీవుడ్ లోకి వచ్చాడు.

గ్రేసి సింగ్

సంతోషం చిత్రంలో నాగార్జున సరసన నటించిన ఈ నటి.అమానత్ అనే సీరియల్ ద్వారా యాక్టింగ్ రంగంలోకి వచ్చింది.ఆ తర్వాత తెలుగు, హిందీ సినిమాల్లో నటించింది.

హన్సిక

ఈమె కూడా సీరియల్స్ ద్వారానే ఇండస్ట్రీలోకి వచ్చింది.తొలుత సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది.ఆ తర్వాత తెలుగు సినిమా చేసింది.బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో అవకాశం పొందింది.

యశ్

కేజీఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా టాప్ హీరోగా గుర్తింపు పొందాడు యశ్.అంతకు ముందు తను సీరియల్స్ లో నటించాడు.తన భార్య రాధిక కూడా సీరియల్ నటి.ఇద్దరు కలిసి పలు సీరియల్స్ చేశారు.

మందిరా బేడి

హీరోయిన్ మందిరా బేడి కూడా ముందు టీవీ సీరియల్స్ చేసింది.దూరదర్శన్ లో వచ్చే ఔరత్ సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యింది.ఈ సీరియల్ లో ఆమె శాంతి అనే క్యారెక్టర్ చేసి.ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

సుడిగాలి సుధీర్

బుల్లి తెరపై జబర్దస్త్ కామెడీ షోలో పాల్గొని ఫేమస్ అయిన సుధీర్.ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్నాడు.

#ActorsWho #Stars #Star Heroes #Serial Actors #Tv Serials

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు