ఈ మధ్య కాలంలో పెద్దమనిషి ఫంక్షన్ నుంచి పెళ్లి వరకు పుట్టినరోజు పార్టీ నుంచి చావు వరకు సందర్భం ఏదైనా మద్యం లేనిదే ఎవరికి కిక్కు రావట్లేదు.అసలు ఈ మధ్య కాలంలో మద్యం తీసుకోవడం అనేది సర్వసాధారణంగా మారింది.
అమ్మో మందా.అనే రోజుల నుంచి మందు లేదా అనే రోజుల్లో ఇప్పుడు మనం జీవిస్తున్నాం.
సో, పార్టీ ఏదైనా మద్యం లేనిదే ఆ పార్టీకి కల ఉండదు.ఇక సినిమా రంగం గురించి చెప్పేదేముంది.
ఈ రంగంలో రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు మద్యం అలవాటు కూడా కచ్చితంగా ఉండాలి అంటారు.ఇప్పుడు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా ఒకప్పటిలా మీడియా వాళ్లకి దొరక్కుండా, బిక్కుబిక్కుమంటూ మద్యం తాగే రోజులు పోయాయి.
ఇప్పుడు తాగకపోతే తప్పన్నట్టుగా చూస్తున్నారు సినీ పెద్దలు.ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండస్ట్రీలో దాదాపు 90 శాతం మంది మద్యం తాగుతారని టాక్.
అయితే ఈ లిస్ట్ లో హీరోలు పెద్ద పెద్ద యాక్టర్లే కాదు హీరోయిన్లు కూడా ఇప్పుడు ఎవరిని పట్టించుకోకుండా వాళ్లకి నచ్చినట్టు మధ్యంలో మునిగితేలుతున్నారు.ఒకప్పుడు సావిత్రి, సిల్క్ స్మిత లాంటి వాళ్లు కూడా మద్యానికి బానిసై వాళ్ల కెరియర్ కి వాళ్ళే ఫుల్స్టాప్ పెట్టుకున్నారు.
కానీ ఇప్పుడున్న హీరోయిన్స్ కొంతమంది మాత్రం ఇవేమి పట్టించుకోకుండా వాళ్ళ లైఫ్ ని వాళ్ళకి నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తూ “అవును మాకు ఫుల్ గా తాగే అలవాటు ఉంది ఇప్పుడు ఏంటి” అంటూ మీడియా వాళ్లకి డైరెక్టుగానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు.అయితే ఆ హీరోయిన్స్ ఎవరు అనేది ఇప్పుడు ఓ లక్కేద్దాం.

ఇక ఈ లిస్ట్ లో మనకి ముందుగా వినిపిస్తున్న పేరు హీరోయిన్ శృతిహాసన్ ది. కమల్ హాసన్ గారి ముద్దుల కూతురైన శృతి హాసన్ తనకున్న తాగుడు అలవాటు గురించి చెప్తూ అసలు మద్యం అలవాటు అయిన తర్వాత దాన్ని మానలేక కెరియర్ పరంగా కూడా ఎన్నో సమస్యలను ఎదురకున్నాను అంటూ చాలా సార్లు చెప్పింది.దీని గురించి అప్పట్లో శృతిహాసన్ మీద ఎన్నో వార్తలు వచ్చాయి.అయితే ప్రస్తుతానికి శృతి మందుకు దూరంగానే ఉందట.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు నేను ఎప్పటికి మద్యం జోలికి వెళ్లనని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఈ భామ.

ఇక ఈ లిస్టులో తమిళ హీరోయిన్ వీణ గారు కూడా ఉన్నారు.ఈమె ఇటీవలే ఒక మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.తనకు మద్యం తాగే అలవాటు ఉంది అయితే ఏంటంట అంటూ చెప్పుకొచ్చింది.
నాకు బీరు తాగే అలవాటు ఉంది అది నా పర్సనల్.ఇప్పుడు చాలా మంది యంగ్ స్టర్స్ కి కూడా ఆ అలవాటు ఉండి ఉండొచ్చు.
అది అసలు తప్పే కాదని నా అభిప్రాయం.ఇలాంటి అలవాటు వల్ల ఎవరికీ ఎటువంటి సమస్య ఉండదు.
అంటూ వ్యాఖ్యలు చేసింది.అయితే ఆ వ్యాఖ్యలని సీరియస్ గా తీసుకున్న మీడియా, వీణ గారిని విపరీతంగా ట్రోల్స్ చేసింది.
అయితే ఆ తర్వాత వీణ ఆ ట్రోల్ చేస్తున్న మీడియా వాళ్లకి గట్టిగానే సమాధానం ఇచ్చింది.

ఇక ఈ లిస్టులో మరొక పాపులర్ యాంకర్ అండ్ హీరోయిన్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించిన శ్రీముఖి పేరు కూడా వినిపిస్తోంది.తన యాక్టింగ్ తో పాటు బిగ్ బాస్ వలన కూడా ఎంతో ఫాలోయింగ్ ని సంపాదించుకున్న శ్రీముఖికి కూడా మందు కొట్టే అలవాటు ఉందట.ఈ విషయాన్ని తాజాగా తన అభిమానుల కోసం లైవ్ లోకి వచ్చినప్పుడు ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ నిజాయితీగా చెప్పాలంటే నేను అకేషన్లకి ఖచ్చితంగా మందు కొడతాను.
ఎక్కువగా వైన్ తాగుతాను అంటూ చెప్పింది.అంతేకాదు వైన్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి

ఇక ఈ లిస్ట్ లో మన సౌత్ సంబంధించిన వాళ్లే ఇంత చేస్తే ఇక బాలీవుడ్ హీరోయిన్స్ ఎంత చేయాలి.బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా కూడా తనకు మద్యం తాగే అలవాటు ఉందని తన సీక్రెట్స్ అన్నిటిని బయట పెట్టింది.సినిమాల్లోకి రాకముందు నాకసలు మద్యం అలవాటు లేదని.
సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా నాలుగైదు సినిమాల వరకూ నేనసలు మద్యాన్ని ముట్టుకోలేదని.ఒకసారి ఏదో ఒక పార్టీలో మొదటిసారి మద్యం తాగి నప్పుడు నా మీద నాకే కంట్రోల్ తప్పి చాలా అందరిపనులు చేశానని అది నాకు చాలా ఫన్నీగా అనిపించిందని.
ఆరోజు పార్టీలో అందరికి ముద్దులు కూడా ఇచ్చానంటూ ఈ భామ తన మొదటి మద్యం ఎక్స్పీరియన్స్ మీడియాతో డైరెక్ట్ గానే పంచుకుంది.
ఇక ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మహేష్ భట్ కుమార్తె మాజీ హీరోయిన్ పూజా భట్ మాట్లాడుతూ.
తనకి కూడా మద్యం అంటే చాలా ఇష్టమని.ఆ ఇష్టం కాస్త నాకు బానిసగా మారిందని మద్యం తాగే మహిళలందరూ కూడా ఆ విషయాన్ని బయట పెట్టరని.ప్రతిసారి వాళ్ళు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారని.నాకు అలాంటి భయాలు ఏమీ లేవని నేను మద్యానికి పూర్తిగా బానిసను అయ్యా అంటూ చెప్పుకొచ్చింది.