కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి ఆరోగ్యం విషమంగా ఉందంటూ వైధ్యులు పేర్కొన్న విషయం తెల్సిందే.ఆయన్ను ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఆ తర్వాత బాలు గారు ఒక వాయిస్ మెసేజ్‌తో తాను బాగానే ఉన్నాను అన్నట్లుగా సందేశం ఇవ్వడంతో పాటు ఒక ఫొటోను కూడా విడుదల చేశారు.ఈ సమయంలో యావత్ సినీ ప్రపంచం మొత్తం ఆయనకు బాగు కావాలని కోరుకుంటూ ప్రార్థనలు చేస్తోంది.
రికార్డు స్థాయి పాటలు పాడిన అద్బుత గాన గంధర్వుడు బాలు గారు.ఆయన ఇండియాలో ఎన్ని భాషల్లో పాటలు పాడాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇండియా వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న అద్బుత గాన గంధర్వ గాయకుడు ఆయన.అలాంటి గాయకుడి ఆరోగ్యం విషమంగా ఉందంటే ఎంతో మంది సినీ ప్రముఖులు తమవంతుగా ముందుకు వచ్చి ఆయన ఆరోగ్యం బాగుండాలంటూప్రార్థనలు చేస్తున్నారు.చిన్నా పెద్ద అంతా కలిసి ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్ ఇంకా ఇతర సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన పలువురు ప్రముఖులు కోలుకున్నారు.అలాగే బాలు గారు కూడా ఖచ్చితంగా కోలుకుంటారంటూ అంతా బలంగా నమ్ముతున్నారు.ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం ప్రార్థనలు చేయాలని సినీ ప్రముఖులు వేడుకుంటూ వారు ప్రార్థనలు చేస్తున్నారు.
ఇంత మంది ప్రార్థనలతో ఆయన త్వరలోనే కోలుకోవాలని ప్రతి ఒక్కరం ఆశిద్దాం.మీరు మేము కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.