స్టార్ రచయిత విజయేంద్రప్రసాద్ కి కరోనా పాజిటివ్

కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మరోసారి అందరిని భయపెడుతుంది.లాక్ డౌన్ నుంచి పూర్తి సడలింపులు ఇచ్చిన తర్వాత ప్రజలు ఎలాంటి కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టారీతిలో తిరగడం, అలాగే మాస్కులు కూడా ధరించకపోవడంతో కరోనా జన్యు మార్పిడి చెంది కొత్త వేరియంట్ తో మరింత బలం పుంజుకొని తిరిగి దాడి చేసింది.

 Star Writer Vijayendra Prasad Have Corona Positive-TeluguStop.com

అదే సమయంలో ప్రభుత్వం కూడా కరోనా పట్ల ప్రజలని అప్రమత్తం చేయడంలో పూర్తిగా విఫలం కావడంతో కరోనా సెకండ్ వేవ్ లో విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి.ఎప్పటిలాగే ఇండియాలో మరణాల సంఖ్య తక్కువగానే ఉన్న కేసులు మాత్రం తీవ్రం అవుతూ అందరిని భయపెడుతున్నాయి.

ముఖ్యంగా నార్త్ ఇండియా రాష్ట్రాలలో కరోనా తీవ్రత ప్రమాదకర స్థాయిలో ఉంది.జనసంచారం విపరీతంగా ఉండటం వలన ముంబై లాంటి మహా నగరాలలో కరోనా విస్తృతి ఎక్కువగా కనిపిస్తుంది.

 Star Writer Vijayendra Prasad Have Corona Positive-స్టార్ రచయిత విజయేంద్రప్రసాద్ కి కరోనా పాజిటివ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే గత ఏడాది కరోనా కొంత మంది సెలబ్రేటీల ప్రాణాలు తీసుకుపోయింది.ఇప్పుడు మరోసారి చిత్రపరిశ్రమపై తన ప్రభావం చూపిస్తుంది.బాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.వారిలో కొంత మంది హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి జాయిన్ అయ్యారు.

కొంతమందికి ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా ఆనవాళ్ళు మాత్రం కనిపించడంతో వారు హోం క్వారంటైన్ లోనే ఉంటున్నారు.బాలీవుడ్ లో కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పటికే చాలా సినిమా షూటింగ్ లు, రిలీజ్ లు వాయిదా పడిపోతున్నాయి.

ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీపైన కూడా కరోనా ఎఫెక్ట్ పడటం మొదలైంది.తాజాగా స్టార్ దర్శకుడు విజయేంద్రప్రసాద్ కరోనా బారిన పడ్డారు.

ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.తనకి టెస్ట్ లలో కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు.

తనని కలిసిన వారంతా కచ్చితంగా కరోనా టెస్ట్ లు చేయించుకోవడంతో పాటు హోం క్వారంటైన్ లో ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

#Corona Pandemic #StarWriter #Corona Positive

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు