బాలయ్య కోసం దర్శకుడుగా మారుతున్న స్టార్ రైటర్  

Star Writer Turns As A Director For Balakrishna - Telugu Anand Krishna, Balakrishna, Nandamuri Fans, Sai Madhav Burra, Tollywood

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతుంది.

 Star Writer Turns As A Director For Balakrishna

ఇక సినిమాలో లుక్ కోసం బాలకృష్ణ ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు.ప్రస్తుతం ఆ లుక్ ని బిల్డ్ చేసే పనిలో ఉన్న బాలకృష్ణ కాస్తా ఏజ్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఎవరితో సినిమా చేస్తాడు అనే టాక్ అప్పుడే ఇండస్ట్రీలో నడుస్తుంది.అయితే ఇప్పుడు ఈ వరుసలో ఓ స్టార్ రైటర్ పేరు బలంగా వినిపిస్తుంది.

బాలయ్య కోసం దర్శకుడుగా మారుతున్న స్టార్ రైటర్-Movie-Telugu Tollywood Photo Image

అతనే సాయి మాధవ్ బుర్రా.

గమ్యం సినిమాతో రచయితగా కెరియర్ ప్రారంభించి, త్రివిక్రమ్ తర్వాత ఇండస్ట్రీలో మాటల రచయితగా స్టార్ ఇమేజ్ గుర్తింపు తెచ్చుకున్న సాయి మాధవ్ బుర్రా ఇప్పుడు సినిమాకి కోటి రూపాయిల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.

స్టార్ హీరోలు అందరూ వారి సినిమాలకి మాటల రచయితగా సాయి మాధవ్ ని తీసుకుంటున్నారు.బలమైన డైలాగ్స్ ని హీరోలతో చెప్పించే ఈ రచయిత కంటెంట్ కి అదనపు బలం అందిస్తాడు.

ఈ కారణంగానే దర్శకులు కూడా సాయి మాధవ్ తో మాటలు రాయించుకుంటున్నారు.ఇప్పుడు ఇతను కూడా దర్శకుడుగా మారడానికి ప్లాన్ చేస్తున్నాడు.తాజాగా బాలకృష్ణకి ఒక ఫాంటసీ స్టొరీ లైన్ చెప్పడం జరిగిందని, ఇది బాలయ్యకి నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసి తీసుకొస్తే చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.బోయపాటి సినిమా అయ్యేనాటికి సాయి మాధవ్ స్క్రిప్ట్ సిద్ధం చేసి మెప్పిస్తే దానినే సెట్స్ పైకి తీసుకెళ్లాలని బాలకృష్ణ భావిస్తున్నట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు