ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కిన స్టార్ రెజ్లర్..!

గత 15 రోజులుగా ఓ హత్య నేరం కేసులో ప్రధాన నిందితుడైన రెజ్లర్ పరారీలో ఉండటంతో ఆ కేసు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.ఎట్టకేలకు సుశీల్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

 Star Wrestler Finally Caught By Police , Susell Kumar, Arrested, Delhi Polices,-TeluguStop.com

హత్యా నేరం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, డబుల్‌ ఒలింపిక్‌ మెడల్ సాధించిన క్రీడాకారుడు సుశీల్‌ కుమార్‌ పోలీసులకు పట్టుబడ్డాడు.పంజాబ్‌లోని జలంధర్‌లో సుశీల్‌తోపాటు అతడి ప్రధాన అనుచరుడు అజయ్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసుల బృందం అదుపులోకి తీసుకుంది.15 రోజులుగా పరారీలో ఉన్న అతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఛత్రసాల్‌ స్టేడియంలో 23 ఏళ్ల యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో 37 ఏళ్ల సుశీల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

తప్పించుకొని తిరుగుతున్న అతడిపై లుక్‌ అవుట్‌ నోటీసు కూడా జారీ అయింది.సీనియర్‌ రెజ్లర్‌ ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష, అతడి అనుచరుడు అజయ్‌ కుమార్‌ సమాచారం చెబితే రూ.50 వేలను బహుమతిగా ఇవ్వనున్నట్టు పోలీసులు ప్రకటించారు.అయితే ముందస్తు బెయిల్‌ కోసం సుశీల్‌ కుమార్ చేసుకున్న దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించడంతో అతడికి వేరే అవకాశం లేకుండా పోయింది.

చివరికి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో మే4 వ తేదీన సాగ‌ర్ రాణా దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు.సుశీల్‌, సాగ‌ర్ వ‌ర్గీయుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో సాగ‌ర్ హ‌త్య‌కు గురైన‌ట్లు పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేల్చారు.

అప్పటినుంచి అజ్థాతంలోకి వెళ్లిపోయిన సుశీల్‌ కుమార్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు సుశీల్‌పై కేసు నమోదు చేశారు.

గత రెండు వారాలుగా పరారీలో ఉన్న సుశీల్ కోసం పోలీసులు మూడు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టినా కూడా ఆయర ఆచూకీ లభించలేదు.దీంతో ఆయనను పట్టిస్తే నగదు పురస్కారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఎట్టకేలకు రెజ్లర్ సుశీల్ కుమార్ పోలీసులకు పట్టుబడ్డారు.ఢిల్లీకి చెందిన సుశీల్‌ కుమార్‌ 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో పాటు 2012 లండన్‌ విశ్వక్రీడల్లో రజత పతకం సాధించారు.

దేశ చరిత్రను ప్రపంచానికి చాటిన ఈ క్రీడాకారుడు ఇలా హత్య చేయడంతో హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube