ఐపీఎల్ లో ఒక్క ఓవర్ కి స్టార్ స్పోర్ట్స్ బీసీసీఐ కి ఎంత చెల్లిస్తుందో తెలుసా ? ఒక్క మ్యాచ్ కి అన్ని కోట్లా ...

ఐపీఎల్ అంటేనే అత్యంత పాపులర్ క్రికెట్ లీగ్ ఇందులో ఆడే ఆటగాళ్లే కాదు బ్రాడ్ కాస్టింగ్ కూడా చాలా కాస్ట్లీ.ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారం హక్కులని స్టార్ స్పోర్ట్స్ కొనుగోలు చేసింది .

 Star Sports Ipl Media Rights Blockbuster Deal-TeluguStop.com

దీనికి స్టార్ స్పోర్ట్స్ భారీ మొత్తాన్ని బీసీసీఐ కి చెల్లిచింది.స్టార్ స్పోర్ట్స్ తో పాటు ఇతర చానెల్స్ కూడా పోటీ పడగా స్టార్ స్పోర్ట్స్ 16,437.50 కోట్లకు ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ హక్కులను సొంత చేసుకుంది.ఇది ఇతర క్రికెట్ లీగ్ లతో పోలిస్తే చాలా ఎక్కువ.ఐపీఎల్ చూసే ప్రేక్షకులు ఎక్కువ పైగా భారతదేశం లో క్రికెట్ కి ఉన్నంత క్రేజ్ మరే ఆటకి లేకపోవడం , ఐపీఎల్ ఆడేది వేసవి లో కావడం తో ఐపీఎల్ మ్యాచ్ అనగానే మన దేశ ప్రేక్షకులు టీవీ లకు అతుక్కుపోతారు.

ఒక్క మ్యాచ్ కి స్టార్ స్పోర్ట్స్ ఎంత పెట్టుబడి పెడుతుంది.

ఐపీఎల్ ప్రారంభం లో మొదటి 6 సంవత్సరాలు సోనీ కంపెనీ తో ఐపీఎల్ హక్కులు ఉండేవి తరువాత స్టార్ స్పోర్ట్స్ బిడ్డింగ్ లో హక్కులను తీసుకుంది.2017 లో జరిగిన వేలం లో 2023 వరకు ఐపీఎల్ హక్కుల్ని స్టార్ స్పార్టా తీసుకుంది.దీనికోసం ఏకంగా 16 వేల కోట్లను చెల్లించింది.ఈ మొత్తం లో చులుకుంటే ఒక్క మ్యాచ్ కి 60 నుండి 70 కోట్ల ఖర్చు అవుతుంది.టీ20 కావడం తో మ్యాచ్ కి ఇరు జట్లు కలిపి 40 ఓవర్లు ఆడుతారు.అందులో ఓవర్ ల మధ్య , వికెట్ పడినప్పుడు మ్యాచ్ లో వచ్చే టైం ఔట్ ల మధ్య వివిధ కంపెనీ లతో స్టార్ స్పోర్ట్స్ యాడ్ హక్కులను అమ్ముతుంది దానితో పాటు స్పాన్సర్షిప్ లు ఆటగాళ్లతో చేసే యాడ్ రూపం లో కూడా డబ్బును రాబట్టుకుంటుంది.

ఐపీఎల్ లో ఒక్క బంతికి 25 లక్షలు

ఐపీఎల్ మ్యాచ్ లో ఒక్క బంతి ని ప్రసారం చేయడానికి స్టార్ స్పోర్ట్స్ బీసీసీఐ కి చెల్లిస్తున్న మొత్తం 25 లక్షల రూపాయలు .ఐపీఎల్ ని కోట్లాది మంది ప్రేక్షకులు చూస్తూ ఉండడం వల్ల ఐపీఎల్ హక్కుల కోసం వివిధ సంస్థలు పోటాపోటీగా బిడ్ వేశారు .స్టార్ స్పోర్ట్స్ కి హాట్ స్టార్ అనే మొబైల్ యాప్ ఉండడం తో మొబైల్ లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.గతేడాది చెన్నై కి సన్ రైజర్స్ కి జరిగిన మ్యాచ్ ని హాట్ స్టార్ లో ఏకంగా కోటి 50 లక్షల మంది వీక్షించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube