ఎస్పీ బాలు ఒక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకునేవారో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు, దర్శకుల పారితోషికాలు కోట్లలో ఉంటాయి.అయితే సింగర్లకు మాత్రం ఎక్కువ మొత్తం పారితోషికం ఇవ్వరనే సంగతి తెలిసిందే.

 Star Singer Sp Balasubramanyam Remuneration For Movies, Sp Bala Subramayam , Rem-TeluguStop.com

తెలుగులోని స్టార్ సింగర్లలో ఒకరైన సిధ్ శ్రీరామ్ ఒక్కో పాటకు 4 లక్షల రూపాయలకు అటూఇటుగా తీసుకుంటుండగా మిగతా సింగర్ల పారితోషికం 25,000 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉందని సమాచారం.

ప్రముఖ సింగర్లలో ఒకరైన విజయ లక్ష్మి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చక్రిగారు తనను చాలా ప్రోత్సహించారని తెలిపారు.

ఇండస్ట్రీలో నాకు గాడ్ ఫాదర్ లేరని అయినప్పటికీ కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నానని విజయ లక్ష్మి వెల్లడించారు.చక్రిగారు తనకు మంచి పాటలు ఇచ్చారని దేవదాసు సినిమాలోని మాయదారి సిన్నోడు పాట తనకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టిందని విజయ లక్ష్మి చెప్పుకొచ్చారు.

Telugu Chakri, Devadas, Ac Rupee, Sidhsriram, Sp Balu, Viajyalashmi, Vijayalaxmi

దేవదాస్ తర్వాత వరుసగా 9 సినిమాల్లో అవకాశం వచ్చిందని విజయ లక్ష్మి అన్నారు. చక్రి కొత్తవాళ్లను ఎక్కువగా ప్రోత్సరించారని విజయ లక్ష్మి అన్నారు.లోకల్ టాలెంట్ ను చక్రి ఎక్కువగా ఎంకరేజ్ చేశారని విజయ లక్ష్మి చెప్పారు.ఎంతోమందికి చక్రి మంచి లైఫ్ ఇచ్చారని విజయ లక్ష్మి అన్నారు.సాంగ్ హిట్టైతే కెరీర్ పరంగా నిలిచిపోతుందని అందువల్ల మూవీ పాటలను పాడే అవకాశాన్ని డబ్బు కోసం ఎవరూ వదులుకోరని విజయ లక్ష్మి వెల్లడించారు.

Telugu Chakri, Devadas, Ac Rupee, Sidhsriram, Sp Balu, Viajyalashmi, Vijayalaxmi

ఎస్పీ బాలుగారు లక్ష రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నారని విజయ లక్ష్మి వెల్లడించారు.పాటల వల్ల షోలలో అవకాశాలు వస్తాయని అలా డబ్బులు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుందని విజయ లక్ష్మి పేర్కొన్నారు.ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరైన రఘు మాస్టర్ వైఫ్ ప్రణవి సైతం సింగర్లకు భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వరని గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే స్టార్ సింగర్లు మాత్రం ఒక్కో పాటకు లక్ష రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube