సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు అన్ని లక్షలు తీసుకుంటారా..?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ సింగర్ల జాబితాలో ఎక్కువగా సిద్ శ్రీరామ్ పేరు వినిపిస్తోంది.తెలుగులో సిద్ శ్రీరామ్ పాడిన పాటల్లో ఎక్కువ పాటలు హిట్ కావడం గమనార్హం.

 Star Singer Sid Sriram Remuneration For Movie Songs-TeluguStop.com

చిన్న హీరోలు సైతం తమ సినిమాల్లో సిద్ శ్రీరామ్ తో పాటలు పాడిస్తున్నారు.సిద్ శ్రీరామ్ పాట వల్ల సినిమా హక్కులకు కూడా డిమాండ్ పెరిగి సినిమా హక్కులు ఎక్కువ మొత్తానికి అమ్ముడవుతున్నాయి.

అయితే ఈ సింగర్ రెమ్యునరేషన్ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

 Star Singer Sid Sriram Remuneration For Movie Songs-సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు అన్ని లక్షలు తీసుకుంటారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఈ సింగర్ ఒక పాటకు నాలుగున్నర లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.

కొన్ని నెలల క్రితం వరకు పాటకు నాలుగు లక్షల రూపాయల పారితోషికం తీసుకున్న సిద్ శ్రీరామ్ కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రెమ్యునరేషన్ పెంచారని తెలుస్తోంది.ప్రస్తుతం తెలుగులో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న సింగర్ మరెవరూ లేరని చెప్పాలి.

Telugu 30 Rojullo Preminchadam Ela, 4.5 Lakh Rupees, Geeta Govindam, Movie Songs, Remuneration, Sid Sriram, Sid Sriram Songs, Special Tunes, Super Hit Songs, Tollywood Star Singer-Movie

మరోవైపు కొంతమంది దర్శకనిర్మాతలు సినిమాలో ఒక పాటైనా సిద్ శ్రీరామ్ తో పాడించాలని సంగీత దర్శకులపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది.కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ సిద్ శ్రీరామ్ కోసం ప్రత్యేకంగా ట్యూన్స్ ను కంపోజ్ చేస్తుండటం గమనార్హం.సిద్ శ్రీరామ్ కు ఉన్న క్రేజ్ ను చూసి ఇతర సింగర్లు సైతం షాకవుతున్నారు.గీతా గోవిందం, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాల్లో శ్రీరామ్ పాడిన పాటలు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు.

ఐ సినిమాతో సింగర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన సిద్ శ్రీరామ్ ఆ సినిమాలో నువ్వుంటే నా జతగా పాటను పాడారు.ఆ పాట హిట్ కావడంతో పాటు సిద్ శ్రీరామ్ కు స్టార్ సింగర్ గా గుర్తింపు రావడానికి కారణమైంది.

#Geeta Govindam #Special Tunes #30Rojullo #TollywoodStar #Sid Sriram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు