దాసరికి 12 కోట్ల అప్పు ఉన్న నిర్మాత .. ఇప్పుడు ఎగ్గొట్టే ప్రయత్నం ?

దర్శకరత్న దాసరి నారాయణరావు ఆకస్మిక మారణం సినీపరిశ్రమవారిని దిగ్భ్రాంతికి గురిచేస్తే, అదే ఇండస్ట్రీలో ఉంటున్న కొంతమందికి మాత్రం సంతోషాన్ని కలిగించింది.అందులో ఒక నిర్మాత కమ్ పంపిణిదారుడు కూడా ఉన్నాడు.

 Star Producer Yet To Clear His 12 Cr Debt To Dasari Narayana Rao ?-TeluguStop.com

ఎందుకంటే ఈ పెద్దమనిషి దాసరి దగ్గర 12 కోట్ల అప్పు తీసుకున్నాడు.ఇదంతా జరిగి ఆరేళ్ళు గడుస్తున్నా, ఇంతవరకు ఆ అప్పు తీర్చలేదు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వీరిద్దరి మధ్య ఆర్ధిక లావాదేవీల సంగతి చాలా గోప్యంగా ఉండేవి అంట.ఆ అప్పు సంగతి ఇంట్లో వాళ్లకి కూడా పెద్దగా తెలియదు అనుకుంటా.బ్రతికున్నప్పుడు దాసరి తన డబ్బు తిరిగి రాబట్టేందుకు చాలా ప్రయత్నం చేసినా, ఆ నిర్మాత మరో మూడు నెలలు, మరో ఆరు నెలలు అంటూ వాయిదాలు వేస్తూనే వచ్చాడు.

ఈ నిర్మాతకి 2011వ సంవత్సరంలో ఓ పెద్ద ఫ్లాప్ తగిలింది.

తెలుకోవడం కష్టం అనుకున్న సమయంలో దాసరి సహాయం చేసారు.అప్పటినుంచి సినిమాలు పెద్దగా నిర్మించకున్నా, పంపిణి రంగంలో మాత్రం కొనసాగుతున్నాడు.

ఇక పంపిణిలో లాభనష్టాల సంగతి మీకు తెలిసిందే.ఓ సినిమా ఆడితే డబ్బు వస్తుంది, మరో సినిమా పొతే ఉన్నదంతా పోతుంది.

ఈ నిర్మాత తన ఆర్ధిక నష్టాల నుంచి తెలుకోలేదు, దాసరి అప్పు తీర్చలేదు.

ఇప్పుడు డబ్బు ఇచ్చిన మనిషే లేడు.

కాని ఈ విషయం దాసరి సన్నిహితులు కొందరికి తెలుసు అంట.మరి ఆ నిర్మాత ఎంతకాలం ఇలా తప్పించుకొని తిరుగుతాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube