ఆ వ్యాపారంలోకి సురేష్ బాబు ఎంట్రీ.. వాళ్లకు షాక్..?

మూవీ మొఘల్ రామానాయుడు కుమారుడు సురేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం సురేష్ బాబు వెంకటేష్, రానాలతో ఎక్కువగా సినిమాలను నిర్మిస్తున్నారు.

 Star Producer Suresh Babu Entry In New Business-TeluguStop.com

అయితే సురేష్ బాబు మరో బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.ప్రస్తుతం ఆడియో రంగంలో కొన్ని ప్రముఖ సంస్థలు ముందువరసలో ఉన్నాయి.

యూట్యూబ్ ఆడియో హక్కుల ద్వారానే ఈ సంస్థలు భారీ లాభాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.అయితే సురేష్ బాబు కూడా త్వరలో ఈ రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

 Star Producer Suresh Babu Entry In New Business-ఆ వ్యాపారంలోకి సురేష్ బాబు ఎంట్రీ.. వాళ్లకు షాక్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

త్వరలో ఎస్ పి మ్యూజిక్ అనే లేబుల్ ను సురేష్ బాబు ప్రారంభించనున్నారని ఈ లేబుల్ పై ఆడియో, వీడియో హక్కులను సురేష్ బాబు కొనుగోలు చేయనున్నట్టు సమాచారం.భారీగా లాభాలు ఉంటాయని భావించి సురేష్ బాబు ఈ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం సీడీలు బంద్ అయిన సంగతి తెలిసిందే.అయినప్పటికీ టీవీ ఛానెళ్ల ద్వారా, ఎఫ్.

ఎంల ద్వారా యూట్యూబ్ తో పాటు వేర్వేరు మ్యూజిక్ అప్లికేషన్ల ద్వారా భారీ మొత్తంలో ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది.ప్రస్తుతం ఈ రంగంలో రెండు, మూడు సంస్థలే పెద్ద సినిమాల హక్కులతో పాటు చిన్న సినిమాల హక్కులను కొనుగోలు చేస్తున్నాయి.

Telugu Audio Rights, New Business, Star Producer, Sureshh Babu, Video Rights-Movie

సురేష్ బాబు ఎంట్రీ తరువాత ఈ రంగంలో కూడా పోటీ పెరిగే అవకాశం ఉంది.అయితే ఈ వ్యాపారంలోకి సురేష్ బాబు ఎంట్రీ ఇవ్వనున్నారని అధికారక ప్రకటన రావాల్సి ఉండగా త్వరలో ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.సురేష్ బాబు ఈ బిజినెస్ లో ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.

#Star Producer #Sureshh Babu #New Business #Audio Rights #Video Rights

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు