భార్యకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన దిల్ రాజు.. అదేమిటంటే..?

కరోనా సెకండ్ వేవ్ వల్ల చిన్న హీరోల సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అందరు హీరోల సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి.చరణ్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మరి కొందరు స్టార్ హీరోలు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు.

 Star Producer Dil Raju Special Gift To His Wife-TeluguStop.com

అయితే దిల్ రాజు మాత్రం కరోనా విజృంభిస్తున్న తరుణంలో తన భార్యతో కలిసి అమెరికాకు ప్రయాణమైన సంగతి తెలిసిందే.గత నెలలో వకీల్ సాబ్ మూవీతో సక్సెస్ అందుకున్న దిల్ రాజు అమెరికాకు వెళ్లడం గురించి వేర్వేరు కారణాలు వినిపించాయి.

అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం దిల్ రాజు తన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకోవడానికి భార్యతో కలిసి అమెరికాకు వెళ్లారు.గతేడాది మే నెల 10వ తేదీన దిల్ రాజు సెకండ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే.

 Star Producer Dil Raju Special Gift To His Wife-భార్యకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన దిల్ రాజు.. అదేమిటంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఖరీదైన ఆభరణాలు, మరికొన్ని బహుమతులను దిల్ రాజు భార్యకు ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.మరోవైపు దిల్ రాజు నిర్మాతగా పలు ప్రాజెక్ట్ లు షూటింగ్ లు జరుపుకుంటున్నాయి.

Telugu America Trip, Dil Raju, His Wife, Special Gift, Vaigha Reddy-Movie

గత కొంత కాలంగా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న దిల్ రాజు ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా సక్సెస్ జోరును కొనసాగిస్తానని నమ్మకం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న చరణ్, శంకర్ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సైతం దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాలతో పాటు థ్యాంక్యూ, విజయ్ వంశీ పైడిపల్లి సినిమా, రౌడీ బాయ్స్, అవసరాల శ్రీనివాస్ తో నూటొక్క జిల్లాల అందగాడు మరికొన్ని సినిమాలను దిల్ రాజు నిర్మిస్తుండటం గమనార్హం.

#America Trip #Special Gift #Dil Raju #Vaigha Reddy #His Wife

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు