దిల్ రాజును దరిద్రం వెంటాడుతోందా.. ఏ సినిమా నిర్మించినా ఫ్లాపేనా?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజుకు ఈ మధ్య కాలంలో నిర్మాతగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.ఒకప్పుడు కొత్త దర్శకులతో సంచలనాలు సృష్టించిన ఈ నిర్మాత ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లతో కూడా మ్యాజిక్ చేయలేకపోతున్నారు.

 Star Producer Dil Raju Bad Luck Movies Flop Details, Dil Raju, Producer Dil Raju-TeluguStop.com

మెజారిటీ సినిమాలు దిల్ రాజు అంచనాలకు తప్పడంతో పాటు నిర్మాతలకు నష్టాలను మిగుల్చుతున్నాయి.గడిచిన మూడేళ్లలో దిల్ రాజు నిర్మించిన సినిమాలలో హిట్టైన సినిమాల కంటే ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

ఇతర భాషల సినిమాలను తెలుగులో రీమేక్ చేసినా దిల్ రాజుకు ఆశించిన ఫలితం దక్కడం లేదు.అదే సమయంలో దిల్ రాజుపై ఊహించని స్థాయిలో నెగిటివిటీ పెరుగుతోంది.

సొంతంగా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం బెటర్ అని ఎక్కువమంది నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.నాగచైతన్యతో రెండు సినిమాలను దిల్ రాజు తెరకెక్కించగా రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

Telugu Dil Raju, Dil Raju Flop, Flop, Janu, Ticket Rates, Tollywood, Vaarasudu,

సమంత, శర్వానంద్ కాంబినేషన్ లో దిల్ రాజు జాను సినిమాను రీమేక్ చేయగా తెలుగులో ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది.తమిళంలో 96 సినిమాను తెరకెక్కించిన దర్శకుడే తెలుగులో ఈ సినిమాను తెరకెక్కించినా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకోలేదు.నానితో దిల్ రాజు నిర్మించిన వి ఏ రేంజ్ ఫ్లాప్ అనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు.వకీల్ సాబ్ మూవీ పలు ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కాలేదు.

Telugu Dil Raju, Dil Raju Flop, Flop, Janu, Ticket Rates, Tollywood, Vaarasudu,

ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడం వకీల్ సాబ్ మూవీ పాలిట శాపమైంది.ఎఫ్3 సినిమా కూడా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.రౌడీ బాయ్స్ సినిమాకు పలు చోట్ల ఫ్రీగా టికెట్లు ఇచ్చినా ఈ సినిమాను ఎవరూ థియేటర్లలో చూడలేదు.వారసుడు సినిమా తెలుగు రిజల్ట్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

ఈ సినిమాలలో చాలా సినిమాలు దిల్ రాజు హిట్ అని చెప్పుకున్నా ఆయన స్థాయికి తగిన సినిమాలు అయితే కాదు.దిల్ రాజును దరిద్రం వెంటాడుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube