ఫ్లాప్ హీరోయిన్ కు బండ్ల గణేష్ ఆఫర్.. కోటి రూపాయలంటూ..?

కొంతమంది హీరోయిన్లకు టాలెంట్ ఉన్నా నటిగా మంచి పేరు వచ్చినా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం సొంతం చేసుకోలేరు.ఎక్కడికి పోతావు చిన్నవాడు సినిమాతో నందితా శ్వేత టాలీవుడ్ కు పరిచయం కాగా ఆ సినిమాలోని పార్వతి పాత్ర నందితకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

 Star Producer Bandla Ganesh Bumper Offer To Heroine Nandita Shwetha, Bandla Gane-TeluguStop.com

ఈ సినిమా తర్వాత శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమకథాచిత్రమ్ 2, కల్కి సినిమాల్లో నందితా శ్వేత నటించగా ఆ సినిమాకు అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

తెలుగులో నందిత శ్వేత చేతిలో ఆఫర్లు బాగానే ఉన్నా స్టార్ హీరోల సినిమాల్లో నందితకు ఆఫర్లు రావడం లేదు.

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షోకు బండ్ల గణేష్ తో పాటు నందితా శ్వేత కూడా హాజరయ్యారు.ఈ షోలో నందితా శ్వేతకు బండ్ల గణేష్ హీరోయిన్ ఆఫర్ ఇస్తానని చెప్పడంతో పాటు కోటి రూపాయల హీరోయిన్ ను చేస్తానని హామీ ఇచ్చారు.

బండ్ల గణేష్ ను షోలో నందిత అన్నయ్య అని సంభోదించటం గమనార్హం.

Telugu Bandla Ganesh, Bumper, Flop, Nandita Swetha, Omkar, Crore, Sixth Sense, T

ఎగ్ ను పగలగొట్టే సమయంలో సిక్త్ సెన్స్ యాంకర్ ఓంకార్ నందిత్వా శ్వేతాను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు.ఓంకార్ చెప్పిన గుడ్డును పగలగొట్టకుండా ఆగాలా.? లేక బండ్ల గణేష్ చెప్పిన గుడ్డును పగలగొట్టాలా.? అని కన్ఫ్యూజన్ లో ఉన్న సమయంలో బండ్ల గణేష్ తాను చెప్పిన గుడ్డును పగలగొడితే హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని చెప్పడంతో నందితా శ్వేత బండ్ల గణేష్ చెప్పిన గుడ్డునే పగలగొట్టారు.

Telugu Bandla Ganesh, Bumper, Flop, Nandita Swetha, Omkar, Crore, Sixth Sense, T

అయితే ఓంకార్ చెప్పిన గుడ్డులోనే బంగారం ఉండటంతో నందితా శ్వేత బంగారం గెలవలేకపోయారు.బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాను నిర్మించనుండగా ఆ మూవీలో నందితకు ఛాన్స్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube