బాలకృష్ణ సినిమా వల్ల నష్టపోయానన్న నిర్మాత.. అసలేమైందంటే?

స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా సదా, తనూశ్రీ దత్తా హీరోయిన్లుగా రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో తెరకెక్కిన వీరభద్ర సినిమా 2005 సంవత్సరంలో విడుదలై ఫ్లాప్ టాక్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్ తో అంబికా సినిమా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.

 Star Producer Ambika Krishna Comments About Balakrishna Veerabhadra Movie Detail-TeluguStop.com

మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా 2005 సంవత్సరం ఏప్రిల్ నెల 29వ ఈ సినిమా విడుదలైంది.

కథ, కథనంలోని లోపాలు ఈ మూవీ ఫ్లాప్ కు కారణమయ్యాయని తెలుస్తోంది.

ఈ సినిమాలోని పాటలు హిట్టైనా నిర్మాతకు మాత్రం భారీ నష్టాలను మిగిల్చింది.ఒక ఇంటర్వ్యూలో అంబికా కృష్ణ మాట్లాడుతూ తనకు వీరభద్ర, ఆడంతే అదో టైపు సినిమాలతో నష్టాలు వచ్చాయని తెలిపారు.

ఆడంతే అదో టైపు సినిమాకు అసలు డబ్బులే రాలేదని ఆర్యన్ రాజేష్ ఆ సినిమాలో హీరోగా నటించగా తమిళంలో హిట్టైన సినిమాకు ఈ సినిమా రీమేక్ అని అంబికా కృష్ణ వెల్లడించారు.

అప్పటికే సక్సెస్ లో ఉన్న రవికుమార్ చౌదరికి సైతం వీరభద్ర సినిమా వల్ల ఫ్లాప్ వచ్చింది.

Telugu Ambika Krishna, Balakrishna, Boyapati Srinu, Lakshmi Simha, Sada, Simha,

లక్ష్మీనరసింహ సినిమా తరువాత బాలకృష్ణ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.2004 సంవత్సరంలో లక్ష్మీ నరసింహ సినిమాతో హిట్ సాధించిన బాలకృష్ణకు ఆ సినిమా తరువాత సినిమాలు భారీ షాకిచ్చాయి.కొన్నేళ్ల పాటు వరుస ఫ్లాపులతో బాలకృష్ణ కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు.

Telugu Ambika Krishna, Balakrishna, Boyapati Srinu, Lakshmi Simha, Sada, Simha,

2010 సంవత్సరంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సింహా సినిమాతో బాలకృష్ణ వరుస ఫ్లాపులకు బ్రేక్ చెప్పారు.సింహా సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టించడంతో బాలకృష్ణ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు.సింహా సినిమా తర్వాత బాలకృష్ణ నటించిన లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు విజయాన్ని అందుకున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube