ప్రభాస్ సినిమా నుంచి నేనే వెళ్లిపోయా.. థమన్ కామెంట్స్ వైరల్!

బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహా, లెజెండ్ విజయాల తర్వాత తెరకెక్కుతున్న అఖండ సినిమాకు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.డిసెంబర్ 2వ తేదీన రిలీజ్ కానున్న అఖండ ప్రమోషన్స్ లో భాగంగా థమన్ మీడియాతో ముచ్చటించారు.

 Star Music Director Thaman Shocking Comments About Rebel Movie-TeluguStop.com

దాదాపుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అందరు స్టార్ హీరోలతో కలిసి పని చేశానని థమన్ అన్నారు.కొందరు హీరోలతో మూడు సినిమాల కంటే ఎక్కువ సినిమాలు చేశానని థమన్ పేర్కొన్నారు.

సమయం వస్తే ప్రభాస్ తో కూడా కలిసి పని చేస్తానని థమన్ వెల్లడించారు.ప్రభాస్ హీరోగా లారెన్స్ డైరెక్షన్ లో రెబల్ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

 Star Music Director Thaman Shocking Comments About Rebel Movie-ప్రభాస్ సినిమా నుంచి నేనే వెళ్లిపోయా.. థమన్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాకు మొదట థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక కాగా ఆ తర్వాత థమన్సినిమా నుంచి తప్పుకున్నారు.రెబల్ సినిమా గురించి అఖండ ప్రమోషన్స్ లో థమన్ మాట్లాడుతూ రెబల్ సినిమాకు తాను డిలే చేయలేదని తెలిపారు.

తానే ఆ సినిమా నుంచి వాకౌట్ చేశానని థమన్ చెప్పుకొచ్చారు.ఏదో ఐడియా వచ్చిందని చెప్పి రాఘవ లారెన్స్ ఆ సినిమాకు మ్యూజిక్ చేస్తానని చెప్పారని లారెన్స్ అలా చెప్పడంతో ఆ సినిమా నుంచి తాను బయటకు వచ్చానని థమన్ అన్నారు.

అలా జరగకుండా ఉండి ఉంటే ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశాన్ని తాను ఎందుకు వదులుకుంటానని థమన్ వెల్లడించారు.

అఖండ మూవీ కాన్సెప్ట్ చాలా బాగుంటుందని ఈ సినిమాకు నెవర్ భిఫోర్ నెవర్ అగైన్ అనే మాట చక్కగా సరిపోతుందని థమన్ చెప్పుకొచ్చారు.ఈ సినిమాలో బోర్ కొట్టే సీన్లు ఉండవని ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని థమన్ అన్నారు.సినిమాలో అఘోరా పాత్ర ఎంట్రీ తర్వాత సినిమా మరో లెవెల్ లో ఉంటుందని థమన్ అన్నారు.

#Akhanda #Rebel #Prabash #Thaman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube