రెమ్యునరేషన్ పెంచేసిన థమన్.. ఎంత తీసుకుంటున్నారంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోలు అయినా హీరోయిన్లు అయినా మ్యూజిక్ డైరెక్టర్లు అయినా క్రేజ్ కు తగిన విధంగా పారితోషికం తీసుకుంటారనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు థమన్ పేరు సమాధానంగా వినిపిస్తోంది.

 Star Music Director Thaman Remuneration Details-TeluguStop.com

యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరు హీరోల సినిమాలకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.సినిమాసినిమాకు సంగీతంలో వేరియేషన్ ఉండేలా థమన్ జాగ్రత్త పడుతున్నారు.

ఈ ఏడాది రిలీజైన సినిమాలలో ఎక్కువ సినిమాలకు థమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కు గట్టి పోటీ ఇస్తున్న థమన్ రెమ్యునరేషన్ విషయంలో హవా కొనసాగిస్తున్నారు.

 Star Music Director Thaman Remuneration Details-రెమ్యునరేషన్ పెంచేసిన థమన్.. ఎంత తీసుకుంటున్నారంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.కొన్ని రోజుల క్రితం వరకు థమన్ కోటిన్నర రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నారట.

అయితే సంగీతం అందించిన సినిమాలు హిట్ కావడంతో పాటు ఆఫర్లు అంతకంతకూ పెరుగుతుండటంతో థమన్ రెమ్యునరేషన్ పెంచారని ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం థమన్ సర్కారు వారి పాట, అఖండ మరికొన్ని సినిమాలకు సంగీతం అందిస్తున్నారు.అయితే బడ్జెట్ ను బట్టి కొన్ని సినిమాలకు థమన్ తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఒక్కో సినిమాకు మూడు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుండగా థమన్ మాత్రం తక్కువగానే రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండటం గమనార్హం.

థమన్ సంగీతం అందిస్తున్న మరికొన్ని సినిమాలు హిట్ అయితే థమన్ రెమ్యునరేషన్ ను మరింత పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి.థమన్ సంగీతం అందించిన అఖండ పాటలు అతి త్వరలో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.

#2 Crores #Akhanda #Thaman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు