థమన్ తొలి పారితోషికం ఎంతో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యుజిక్ డైరెక్టర్ గా తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో థమన్ ఒకరు.దశాబ్ద కాలం క్రితం కిక్ సినిమాతో తెలుగులో కెరీర్ మొదలుపెట్టిన థమన్ ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.

 Star Music Director Ss Thaman First Movie Remuneration, Ss Thaman, Music Directo-TeluguStop.com

అయితే థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ స్థాయిని అందుకోవడానికి పడిన కష్టం అంతాఇంతా కాదు.చిన్నప్పటి నుంచి సంగీతం అంటే థమన్ కు ఎంతో ఇష్టం.

చిన్న వయస్సులోనే తండ్రి చనిపోవడంతో థమన్ ఆర్థికంగా ఎదగడానికి మ్యూజిక్ లోనే కెరీర్ ను వెతుక్కున్నాడు.

నేడు థమన్ పుట్టినరోజు.

డ్రమ్స్ వాయించడం ఎంతో ఇష్టమైన థమన్ ఎక్కడైనా సంగీత పోటీలు జరిగితే అక్కడ డ్రమ్స్ వాయించేవారు.అయితే తండ్రి మరణం తరువాత ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురు కావడంతో థమన్ చదువుకు దూరం కావాల్సి వచ్చింది.

అయితే థమన్ తండ్రికి ఇండస్ట్రీలో మంచి పేరు ఉండటం వల్ల చాలామంది డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించేవాళ్లు.

Telugu Rupees, Balakrishna, Kick Music, Manisharma, Ss Thaman, Thaman-Movie

బాలకృష్ణ నటించిన భైరవద్వీపం సినిమాకు డ్రమ్మర్ గా పని చేసిన థమన్ ఆ సినిమాకు 30 రూపాయలు పారితోషికం తీసుకున్నారు.ఆ తరువాత సినిమాసినిమాకు స్థాయిని పెంచుకుంటూ ప్రస్తుతం కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు.అనుకోకుండా థమన్ కు బాయ్స్ సినిమాలో ఛాన్స్ రాగా ఆ సినిమాలో డ్రమ్స్ వాయించే వ్యక్తిగా నటించి థమన్ మెప్పించారు.

ఆ తరువాత ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ దగ్గర థమన్ చాలా సంవత్సరాల పాటు పని చేశారు.పన్నేండేళ్ల కెరీర్ లో అనేక సినిమాలు హిట్ కావడంలో థమన్ పాత్ర చాలా ఉంది.

సంగీతంతో పాటు నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా అందిస్తాడని పేరు తెచ్చుకున్న థమన్ సినిమాసినిమాకు తన స్థాయిని పెంచుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube