వామ్మో.. రెహమాన్ పెట్టుకున్న మాస్క్ ఖరీదు అన్ని వేలా..?

సాధారణంగా సామాన్య ప్రజలు ఉపయోగించే మాస్క్ ధర 10 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు ఉంటుంది.అయితే సెలబ్రిటీలు మాత్రం మాస్క్ ను కొనుగోలు చేయడానికి కొంత ఎక్కువ మొత్తం ఖర్చు చేయడంతో పాటు స్పెషల్ ఫీచర్లు ఉన్న మాస్క్ లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

 Star Music Director A R Rehaman Mask Price Details-TeluguStop.com

తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ మాస్క్ తో ఉన్న ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఏ ఆర్ రెహమాన్ ధరించిన ఈ మాస్క్ ధర 12,000 రూపాయలు అని సమాచారం.తాజాగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఏ ఆర్ రెహమాన్ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా రెహమాన్ ధరించిన మాస్క్ గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది.రెహమాన్ ధరించిన మాస్క్ మినీ ఎయిర్ ఫ్యూయెర్ మాస్క్ కావడం గమనార్హం.

 Star Music Director A R Rehaman Mask Price Details-వామ్మో.. రెహమాన్ పెట్టుకున్న మాస్క్ ఖరీదు అన్ని వేలా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఢిల్లీ ప్రజలు ఎక్కువగా ఈ తరహా మాస్క్ లను వినియోగిస్తున్నారని తెలుస్తోంది.

సెలబ్రిటీలు వినియోగిస్తున్న ఫేస్ షీల్డ్ లు , కొందరు సెలబ్రిటీలు డిజైన్ చేయించుకుంటున్న మాస్క్ లు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరోవైపు ఏ ఆర్ రెహమాన్ వరుస మూవీ ఆఫర్లతో బిజీ అవుతున్నారు.ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడు ఒక్కో సినిమాకు 5కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.

సౌత్ ఇండియాలో ఈ స్థాయిలో పారితోషికం తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ మాత్రమే కావడం గమనార్హం.

రెహమాన్ పరిమితంగా సినిమాలు చేసినా సినిమాలోని ప్రతి పాట హిట్ అయ్యే విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.ఆ కారణం వల్లే రెమ్యునరేషన్ ఎక్కువైనా రెహమాన్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా తమ సినిమాలకు తీసుకోవడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతుండటం గమనార్హం.రెహమాన్ తర్వాత దేవి శ్రీ ప్రసాద్ మూడు కోట్ల రూపాయల నుంచి నాలుగు కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు.

#12000 Rupees #ArRehman #ArRehman #Price Details #5 Crore Rupees

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు