నెల వ్యవధిలో మళ్లీ రాబోతున్న కేజీఎఫ్‌  

Star Maa to telecast KGF Movie, KGF Movie, KGF movie on tv, Yash - Telugu Kgf Movie, Kgf Movie On Tv, Star Maa To Telecast Kgf Movie, Yash

కన్నడ సూపర్‌ హిట్‌ చిత్రం కేజీఎఫ్‌ తెలుగులో కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.దాదాపు రెండు సంవత్సరాల క్రితం వచ్చిన కేజీఎఫ్‌ చిత్రం కన్నడం తెలుగు తమిళంలో మాత్రమే కాకుండా బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది.

 Star Maa To Telecast Kgf Movie

దాంతో అందరి దృష్టి ఇప్పుడు కేజీఎఫ్‌ 2 పై ఉంది.సినిమా విడుదలై రెండు సంవత్సరాలు కావస్తున్న ఎందుకు బుల్లి తెరపై ప్రసారం కావడం లేదు అనుకుంటున్న సమయంలో స్టార్‌ మాలో గత నెలలో ప్రసారం అయిన విషయం తెల్సిందే.

సినిమాకు ఉన్న టాక్‌ నేపథ్యంలో సినిమా వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా భారీగా టీఆర్పీ రేటింగ్‌ వచ్చింది.

నెల వ్యవధిలో మళ్లీ రాబోతున్న కేజీఎఫ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

గత నెలలో మొదటి సారి స్టార్‌ మాలో ఆదివారం సాయంత్రం ప్రసారం అయ్యింది.

అయితే కేవలం నెల రోజుల వ్యవధిలో మళ్లీ కేజీఎఫ్‌ ను స్టార్‌ మా ప్రసారం చేసేందుకు సిద్దం అయ్యింది.అయితే ఈసారి మద్యాహ్నం 12 గంటల సమయంలో ప్రసారం చేసేందుకు రెడీ అయ్యింది.

కేవలం నెల రోజుల గ్యాప్‌లో రాబోతున్న ఈ సినిమాకు ఈసారి రేటింగ్‌ ఎలా ఉంటుంది అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.డబ్బింగ్‌ సినిమా మాదిరిగా కాకుండా డైరెక్ట్‌ సినిమాను మించి రేటింగ్‌ దక్కించుకుంది.

మరి రెండవ సారి కూడా అదే స్థాయి రేటింగ్‌ను పొందుతుందో చూడాలి.ఇక నుండి స్టార్‌ మా మరియు స్టార్‌ మా మూవీస్‌ లో కేజీఎఫ్‌ ను వందల సార్లు వేసే అవకాశం ఉంది.

రేపటి రేటింగ్‌ ను బట్టి మరో నెల రోజుల గ్యాప్‌లోనే మళ్లీ మాటీవీలో ప్రసారం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

#StarMaa #Yash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Star Maa To Telecast Kgf Movie Related Telugu News,Photos/Pics,Images..