హీరో వెంకటేష్ చెల్లి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

ఎవరబ్బా వెంకటేష్ చెల్లి అని అనుకుంటున్నారా? ఇంకా గుర్తు రాలేదా? ఆమెనండి వర్ష.వాసు సినిమాలో వెంకటేష్ చెల్లిగా నటించి మంచి మార్కులు కొట్టేసిందిగా.2000 సంవత్సరంలో వచ్చిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతంగా నటించిన వర్ష.హీరోయిన్ క్యారెక్టర్ లో నటించకపోయిన ఈమె ఫోటో ఒకటి చూస్తే చాలు ఎవరైనా గుర్తుపడతారు.

 Star Maa Kasthuri Serial Mother Character Varsha  Character Artist Varsha, Hero-TeluguStop.com

అన్ని సినిమాల్లోను చెల్లిగా, వదినగా, అక్కగా మంచి మంచి పాత్రల్లో నటించిన ఆర్టిస్ట్ వర్ష ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

తెలుగు సీరియల్స్ చూసే ఎవరైనా సరే టక్కున గుర్తుపడతారు.ఎందుకంటే ఆర్టిస్ట్ వర్ష ఇప్పుడు తల్లి పాత్రలో అద్భుతంగా నటిస్తుంది కాబట్టి.

స్టార్ మా లో ప్రసారం అవుతున్న కస్తూరి సీరియల్ లో వర్ష హీరోయిన్ ఐశ్వర్య తల్లిగా కీలక పాత్రలో నటిస్తుంది.సీరియల్ లో హీరోయిన్ ఐశ్వర్య అయినప్పటికి కథ మొత్తం వర్ష పాత్ర చుట్టే తిరుగుతుంది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించిన ఈమె 2005, 2006 సంవత్సరాల తర్వాత కనుమరుగైపోయారు.12 ఏళ్ల వయసులోనే పంజరం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన వర్ష ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది. సుస్వాగతం, వాసు, నువ్వే కావాలి వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది వర్ష.

అయితే నిజానికి వర్ష పేరు మాదవి.

నువ్వే కావాలి సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించిన ఆమె పాత్రకు మంచి పేరు రావడంతో ఆమె పేరు వర్షగా మారిపోయింది.అయితే దాదాపు 30 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆమె 5 సీరియల్స్ కి పైగా నటించింది.

ఇక పెళ్లి తర్వాత పిల్లల కోసం సినిమాలకు, ఇండస్ట్రీకి దూరం అయిన ఈ భామ ఇప్పుడు కస్తూరి సీరియల్ తో బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది.మంచి కథతో వచ్చిన ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube